సర్పంచులు, ఉప సర్పంచుల నుంచి రికార్డులు, చెక్‌బుక్కులు, డిజిటల్‌ సంతకాల కీలను వెంటనే స్వాధీనం చేసుకోవాలి!

హైదరాబాద్‌: గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన నేపథ్యంలో రాష్ట్రంలోని సర్పంచులు, ఉప సర్పంచుల నుంచి రికార్డులు, చెక్‌బుక్కులు, డిజిటల్‌ సంతకాల కీలను వెంటనే స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసింది., గురువారంతో సర్పంచుల పదవీకాలం ముగుస్తున్నందున వాటిని స్వాధీనం చేసుకోవాలని తెలిపింది. ఎవరైనా ఈ ఆదేశాలు పాటించని పక్షంలో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టంచేసింది. ప్రస్తుతం డిజిటల్‌ సంతకాల కీలు పెన్‌డ్రైవ్‌ల రూపంలో సర్పంచులు, ఉప సర్పంచుల వద్ద ఉన్నాయి. వాటిని పంచాయతీ కార్యదర్శులు […]

జాతీయస్థాయి కరాటే పోటీలలో రజత పతకం సాధించిన ఆల్ఫోర్స్ విద్యార్థి

జగిత్యాల ఆల్ఫోర్స్ ఈ టెక్నో స్కూల్ శివ వీధి విద్యార్థికి జాతీయస్థాయి కరాటే పోటీలలో రజిత పథకం మరియు ప్రశంసా పత్రం విద్యార్థులకు విద్య తో పాటు క్రీడల పట్ల అవగాహన కల్పించాలని మరియు అందులో పాల్గొనేలా ప్రోత్సహించాలని పాఠశాల నిర్వహకులు స్థానిక శివ వీధిలోని ఆల్ఫోర్స్ ఈ టెక్నో స్కూల్ విద్యార్థికి జాతీయ కరాటే పోటీలలో రజిత పథకం సాధించడం పట్ల ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రాథమికంగా విద్యార్థులకు పాఠశాలలో […]

హిందూ ధర్మ సేవ సమితి ఆధ్వర్యంలో దీపోత్సవం

నర్సింహులపల్లి గ్రామంలో హిందూ ధర్మ సేవ సమితి ఆధ్వర్యంలో దీపోత్సవం నర్సింహులపల్లి, జగిత్యాల నియోజకవర్గం : జగిత్యాల నియోజకవర్గం బీర్ పూర్ మండలం నర్సింహులపల్లి గ్రామంలో హిందూ ధర్మ సేవ సమితి ఆధ్వర్యంలో దీపోత్సవంను ఘనంగా నిర్వహించారు. అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్టా మహోత్సవం సందర్బంగా సోమవారం రాత్రి గ్రామ ప్రజలందరూ కలిసి హనుమాన్ ఆలయ ఆవరణలో దీపాలంకరణ చేసి…జై శ్రీ రామ్ నినాదాలు, రామ నామ జపంను తలుస్తూ భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ […]

జెడ్డాలో పలు సంస్థల ప్రతినిధులతో ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు వరుస భేటీలు

తెలంగాణలో పెట్టబడులు పెట్టండి–పెట్టుబడులకు తెలంగాణ అనువైన రాష్ట్రం–ప్రభుత్వం తరఫున అన్ని సహాయ సహకారాలు అందిస్తాం -మంత్రి శ్రీధర్ బాబు –జెడ్డాలో పలు సంస్థల ప్రతినిధులతో ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు వరుస భేటీలు –సౌదీ అరేబియా ప్రభుత్వ వర్గాలతోనూ మంత్రి శ్రీధర్ బాబు సమావేశం –సానుకూలంగా స్పందిస్తున్న అనేక సంస్థలు హైదరాబాద్ : (జెడ్డా) (sircilla srinivas) పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణ అనువైన రాష్ట్రమని, తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకురావాలని పలు బహుళజాతి కంపెనీలకు రాష్ట్ర […]

ఉత్సాహంగా సాగుతున్న దావోస్ పర్యటన-తెలంగాణ వైపు ఆకర్షితులౌతున్న పెట్టుబడిదారులు

ఉత్సాహంగా సాగుతున్న దావోస్ పర్యటన-తెలంగాణ వైపు ఆకర్షితులౌతున్న పెట్టుబడిదారులు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 54వ వార్షిక సమావేశంలో… తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతమైన రీతిలో ఆవిష్కరణలు మరియు ప్రగతి కేంద్రంగా ప్రదర్శించేందుకు ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి, ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు మరియు సంబంధిత అధికారులు జయేష్ రంజన్, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వి. శేషాద్రి మరియు ఇతర ఉన్నతాధికారులతో కూడిన తెలంగాణ ప్రతినిధి బృందానికి దావోస్ లో పలు పారిశ్రామికవేత్తలు ఘనంగా […]

ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా #InvestInTelangana క్యాంపెయిన్ విజయవంతంగా ప్రారంభం

ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా తెలంగాణ ప్రభుత్వం ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ (#InvestInTelangana) క్యాంపెయిన్ విజయవంతంగా ప్రారంభించింది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సదస్సులో పాలుపంచుకుంటున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తో కలిసి ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో కీలక సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఐటీ, జీవ వైద్య శాస్త్ర రంగానికి ముఖ్య కేంద్రంగా అభివృద్ధి చెందిన తెలంగాణ బలాలను ప్రపంచానికి చాటి […]

స్విట్జర్లాండ్‌లోని జూరిచ్ విమానాశ్రయంలో సిఎం రేవంత్ రెడ్డి, ఐటి మంత్రి శ్రీధర్ బాబులకు ఘన స్వాగతం

స్విట్జర్లాండ్‌లోని జూరిచ్ విమానాశ్రయంలో సిఎం రేవంత్ రెడ్డి, ఐటి మంత్రి శ్రీధర్ బాబులకు పలువురు ప్రవాసీ తెలంగాణ ప్రముఖుల ఘన స్వాగతం స్విట్జర్లాండ్‌లోని జూరిచ్ విమానాశ్రయంకు చేరుకున్న తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డితో పాటుగా ఐటి మంత్రి శ్రీధర్ బాబులకు పలువురు ప్రవాసీ తెలంగాణ ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబులు ప్రవాసీ తెలంగాణ ప్రముఖులకు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం స్విట్జర్లాండ్‌లోని జూరిచ్ విమానాశ్రయంలో పలువురు ప్రవాసీ తెలంగాణ […]

ప్రతి శుక్రవారం హైదరాబాదు నుంచి అయోధ్యకు ప్రత్యేక రైలు

ప్రతి శుక్రవారం హైదరాబాదు నుంచి అయోధ్యకు ప్రత్యేక రైలురామమందిర్ దర్శనానికి వెళ్తున్న ప్రయాణికుల కోసం హైదరాబాద్ నుంచి అయోధ్యకు ప్రతి శుక్రవారం రైలు సదుపాయం కల్పించారు. ఈనెల 22వ తేదీన అయోధ్యలో శ్రీరామ మందిర ప్రారంభోత్సవం జరుగనున్న నేపథ్యంలో యశ్వంత్‌పూర్-గోరఖ్‌పూర్ (నెంబర్ 15024) ఎక్స్‌ప్రెస్ రైలు ప్రతి గురువారం రాత్రి 11.40 గంటలకు యశ్వంత్‌ పూర్‌లో బయలుదేరి శుక్ర వారం ఉదయం 10.40 గంటలకు కాచిగూడ రైల్వేస్టేషన్ చేరుతుంది. 10.50 గంటలకు కాచి గూడలో బయలుదేరి కాజీపేట, […]

స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మానవత్వాన్ని చాటుకున్న డా.జి సురేంద్రబాబు

స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మానవత్వాన్ని చాటుకున్న డా.జి సురేంద్రబాబు మండేపల్లి ప్రభుత్వ వయోవృద్ధుల ఆశ్రమంలో 161 వ జయంతి  50 LPH వాటర్ ప్యూరిఫైడ్,60 లీటర్ SS రిఫ్రిజిరేటర్, పండ్లు మరియు దుప్పట్ల పంపిణీ తాగునీటికి ఇబ్బంది పడుతున్న 26 మంది వయోవృద్ధులకు చేయూత రాజన్న సిరిసిల్ల జిల్లా: (Reporter:Sampath P): తంగళ్ళపల్లి మండలం మండేపల్లి వృద్ధాశ్రమంలో 26 మంది వృద్ధులు త్రాగునీటికి ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్న డా.జి. సురేంద్రబాబు మానవత్వంతో సహకారమందించారు.  నరేన్ ఫౌండేషన్ మరియు […]

గల్ఫ్ హామీల అమలు కోసం ఏఐసీసీ నాయకులు రామచంద్ర కుంతియా చొరవ

హైదరాబాద్ : గల్ఫ్ హామీల అమలు కోసం ఏఐసీసీ నాయకులు రామచంద్ర కుంతియా చొరవ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ఇచ్చిన హామీల అమలు కోసం తాను చొరవ తీసుకుని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డితో చర్చించనున్నట్లు ఏఐసీసీ నాయకులు రామచంద్ర కుంతియా గురువారం తెలిపారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు, ఎన్నారై పాలసీ ఏర్పాటుకు చర్యలు చేపట్టడంతో పాటు అత్యవసరంగాగల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించడానికి జీ.ఓ. […]

Verified by MonsterInsights