రచయిత్రి నామని సుజనా దేవికి ఉత్తమ రచయిత్రిగా తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం

రచయిత్రి నామని సుజనా దేవి ఉత్తమ రచయిత్రిగా తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారాన్ని, ఎన్టీఆర్ ఆడిటోరియం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో అందుకున్నారు.

విశ్వ విద్యాలయం ఆడిటోరియంలో జరిగిన పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమంలో కార్యక్రమ ముఖ్య అతిథి గా హాజరైన తెలంగాణ రాష్ట్ర జుడిషియల్ అకాడమీ డైరెక్టర్ మంగారి రాజేందర్ మరియు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్ లర్ ఆచార్య తంగెడ కిషన్ రావు లు రచయిత్రికి పురస్కారాన్ని ప్రధానం చేశారు. ఈ కార్యక్రమం లో యూనివర్సిటీ అసిస్టెంట్ డైరెక్టర్ రింగు రామమూర్తి, రిజిస్త్రార్ ఆచార్య బట్టు రమేష్, సాహితీ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

రచయిత్రి నామని సుజనా దేవి ఇప్పటివరకు దాదాపు 300 పై చిలుకు కథలు, 100కు పైగా కవితలు వ్యాసాలు, వ్రాశారు.

60కి పైగా కథలు, 25 కు పైగా కవితలు, 15కుపైగా వ్యాసాలు, నాలుగు నవలలు జాతీయంగా, అంతర్జాతీయంగా బహుమతులు గెలుచుకున్నాయి.
30కి పైగా పురస్కారాలు వచ్చాయి.
కొన్ని కథలు కన్నడములోకి, ఇంగ్లీషులోకి అనువాదం చేయబడ్డాయి.ప్రతిలిపి వెబ్ సైట్ లో ఆరు లక్షల 50 వేల పై చిలుకు అభిమానులు ఉన్నారు.

ఇప్పటివరకు ఆరు కథా సంపుటాలు, మూడు కవిత సంపుటాలు, ఒక్క నవల వెలువరించారు. ఒక కవితా సంపుటికి, 4 నవలలకు, ఐదు కథా సంపుటాలకు జాతీయ స్థాయి పురస్కారాలు వచ్చాయి. స్పందించే హృదయం ఒక కథా సంపుటికే ఆరు జాతీయస్థాయి పురస్కారాలు దక్కడం, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు కావడం విశేషం. చెస్, అథ్లెటిక్స్ లాంటి స్పోర్ట్స్ లలో ఎల్ఐసి ద్వారా జోనల్ లెవెల్లో పాల్గొనడం వల్ల ‘మల్టీ టాలెంటెడ్ ఉమెన్ గా’ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారి పురస్కారం దక్కింది.
50 కి పైగా ఆర్టికల్స్ ఆకాశవాణి ద్వారా ప్రసారం అయ్యాయి. దూరదర్శన్ యాదగిరి ఛానల్ ద్వారా, వరంగల్ ద్వారా, ఇతర యూట్యూబ్ ఛానల్ ల ద్వారా ఇప్పటికీ ఆరు సార్లు ఇంటర్వ్యూలు ప్రసారం అయ్యాయి.
కథా కిరీటి, కవి సుధ, సాహిత్య చక్రవర్తిని, సాహిత్య సౌగందిక బిరుదులు వరించాయి.

ఉత్తమ రచయిత్రి గా కీర్తి పురస్కారం అందుకోవడము ఏ జన్మలోనో చేసుకున్న సుకృతం అని రచయిత్రి నామని సుజనా దేవి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights