రాజన్న సిరిసిల్ల జిల్లా..

ఎల్లారెడ్డిపేట సర్కిల్ ప్రజలకు ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు

డిసెంబర్ 31 సందర్భంగా ఎల్లారెడ్డిపేట సర్కిల్ పరిదిలోని ఎల్లారెడ్డిపేట, గంభిరావుపెట మరియు వీర్ణపల్లి మండలాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ తీసుకునే  ముందస్తు రక్షణ చర్యలకు  ప్రతి ఒక్కరు సంపూర్ణమైన సహాయ సహకారాలు అందించవలసిందిగా స్థానిక సీఐ శశిధర్ రెడ్డి  తెలియజేశారు.

ఈ సందర్భంగా శనివారం ఎల్లారెడ్డిపేట సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... డిసెంబర్ 31 రోజు సాయంత్రం నుండి మూడు మండలంలో స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయడం జరుగుతుందని, డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరకిన వారి బైక్ లను సీజ్ చేయడం జరుగుతుందని మరియు మైనర్స్ కి బైకులు ఇవ్వడం వల్ల ప్రమాదాలు జరగవచ్చు కావున తల్లిదండ్రులు మైనర్ పిల్లలకి బైకులు ఇవ్వరాదు అని పట్టుబడితే కేసులు నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights