మహిళలు,చిన్నారుల సంరక్షణే పోలీసుల ప్రధాన ధ్యేయం అని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు.
మహిళ భద్రతకు భరోసనిస్తూ జిల్లా కేంద్రంలో భరోసా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ శుక్రవారం ప్రారంభించారు.
మహిళ భద్రతకు భరోసనిస్తూ, బాధిత మహిళలను, పిల్లలను అక్కున చేర్చుకొని, కొండంత ధైర్యానిస్తూ, భరోసా సెంటర్ ద్వారా మహిళల, పిల్లల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపడమే లక్ష్యంగా భరోసా సెంటర్ సేవలు అందిస్తుందని జిల్లా ఎస్పీ అన్నారు.

మహిళలు,చిన్నారుల రక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భరోసా కేంద్రాల ఏర్పాటులో భాగంగా ఈరోజు జిల్లా కేంద్రంలోని శ్రీనగర్ కాలనిలో ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాన్ని ట్రైనీ ఐపీఎస్ రాహుల్ రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, భరోసా కేంద్రం సిబ్బంది తో కలసి శుక్రవారం ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights