ప్రజలకు ప్రభుత్వానికి వారదులుగా పత్రికలు పనిచేయాలి: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

ఆంధ్రప్రభ దిన పత్రిక క్యాలెండర్ ఆవిష్కరణలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

ప్రభుత్వానికి ప్రజలకు వారదులుగా పత్రికలు పనిచేయాలని వేములవాడ శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించక ముందు నుండి ఆంధ్రప్రభ దినపత్రిక ప్రచురితమవుతుందన్నారు.

శనివారం వేములవాడ లో ఆంధ్రప్రభ రాజన్న సిరిసిల్ల జిల్లా 2024 నూతన క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఆంధ్రప్రభ దినపత్రిక చదవడం అలవాటని, 1938లో ఆంధ్రప్రభ దినపత్రిక ప్రచురితం ప్రారంభమైందని, దినదినాభివృద్ధి చెందుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో డిజిటల్, వెబ్, యూట్యూబ్ విభాగాల ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందజేస్తున్నదన్నారు.

స్వాతంత్ర్య సంగ్రామం ఉద్యమంలో ఆంధ్రప్రభ ఉద్యమ స్ఫూర్తిని, ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ప్రచురించిన కథనాలను గుర్తు చేశారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వాలను ఆలోచింపజేసే కథనాలతో ఆంధ్రప్రభ దినపత్రిక మన్ననలు పొందిందన్నారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రభ వేములవాడ ఇన్చార్జి లాయక్ పాష, జర్నలిస్టులు జితేందర్ రావు, షేక్ రియాజ్, కోడం గంగాధర్, మహమ్మద్ నయీం, ప్రజా ప్రతినిధులు, కౌన్సిలర్ బింగి మహేష్, సర్పంచ్ కరుణాకర్ లతో పాటు అరుణ్ తేజా చారి, లక్కాకుల శ్రీనివాస్, కొత్త అనిల్ ,సంపేట గంగరాజు,లక్కాకుల తాత్విక,ఆద్విక్ , కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు పలువురు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights