ప్రతి విద్యార్థి తనలో ఉన్న బలం,బలహీనతలను తెలుసుకుంటూ,బలహీనతలను అధిగమించడానికి కృషి చేయాలి:IAS అధికారి J.మురళి

రామచంద్ర మిషన్ వారి “హార్ట్ ఫుల్ నెస్” సంస్థ ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులకు బుధవారం మధ్యాహ్నం ధ్యానం పై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ధ్యాననిపుణులు, ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఐ.ఎ.ఎస్.అధికారి జె. మురళి, కన్వీనర్లు మంచాల క్రిష్ణ , తోట హరి, విష్ణుదాసు గోపాల్ రావు, కళాశాల కరస్పాండెంట్ ముసిపట్ల రాజేందర్, మల్లేశం గౌడ్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ సభ్యుడు సిరిసిల్ల శ్రీనివాస్, రోటరీ క్లబ్ సభ్యుడు టివి సూర్యం మరియు అధ్యాపక బృందం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులతో ధ్యానం చేయించి, అందుకు సంబంధించిన విశిష్టతను వివరించారు. ప్రతి విద్యార్థి తనలో ఉన్న బలం, బలహీనతలను తెలుసుకుంటూ…బలహీనతలను అధిగమించడానికి కృషి చేయాలని హితవు పలికారు. ఇందుకు ప్రధానంగా మెడిటేషన్ పట్ల అవగాహన కలిగియుండాలన్నారు.

అంతేకాకుండా ఒక టీం వర్క్ గా విజయభ్యాసం చేసినప్పుడు ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు అన్న విషయాన్ని విద్యార్థులు విద్యాసంస్థల యాజమాన్యాల గ్రహించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.

జగిత్యాల: రామచంద్ర మిషన్ ‘హార్ట్ ఫుల్‌నెస్’ ఆధ్వర్యంలో SKNR కళాశాలలో ధ్యానంపై అవగాహన, పాల్గొన్న IAS అధికారి J.మురళి https://link.public.app/c4Zwv?utm_medium=android&utm_source=share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights