హైదరాబాద్

జనవరి 1న హైదరాబాద్ నుమాయిష్ ప్రారంభం

ప్రతిష్టాత్మక నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖల మంత్రి శ్రీధర్ బాబు నియమి తులయ్యారు.

గతంలో సొసైటీ అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి హరీశ్ రావు ఇటీవలే రాజీనామా చేసిన నేపథ్యంలో గురువారం రాత్రి సొసైటీ మేనేజింగ్ కమిటీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు.

అధ్యక్షుడిగా శ్రీధర్ బాబును ఎన్నుకుంటూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు వనం సత్యేందర్, కార్యదర్శి హను మంతరావు, మాజీ ఉపాధ్యక్షుడు అశ్విన్ మార్గం, మాజీ కార్యదర్శి చంద్రశేఖర్ శుక్రవారం మంత్రి శ్రీధర్ బాబును సన్మానించారు.

జనవరి 1వ తేదిన 83వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) ప్రారం భమవుతుందని, త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ప్రారంభ కార్యక్రమానికి ఆహ్వానిస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights