నేను ఏ తప్పూ చేయలేదు.. ప్రజలు చూపిన అభిమానం ఎప్పటికీ మర్చిపోలేను-టీడీపీ అధినేత చంద్రబాబు

కష్ట కాలంలో తెలుగు ప్రజలు చూపిన అభిమానం తాను ఎప్పటికీ మర్చిపోలేనని.. టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయన పార్టీ శ్రేణులనుద్దేశించి మీడియాతో మాట్లాడారు

అనంతరం తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ తప్పు చేయలేదు, ఎవరినీ కూడా తప్పుచేయనివ్వలేదన్నారు. తనకు మద్దతుగా నిలిచిన అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. తనకు అండగా నిలిచిన వివిధ పార్టీల నేతలకు కూడా ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.

గత 52 రోజులుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు నిర్విరామంగా సంఘీభావం తెలిపారు. అందుకు వారందరికీ నా కృతజ్ఞతలు. తాజాగా హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు సంఘీభావం తెలిపారు. మీ అభిమానంతో నా జన్మ ధన్యమైంది. నేను చేసిన అభివృద్ధిని 52 రోజులూ గుర్తు చేసుకున్నారు. అండగా నిలబడిన ప్రతి కార్యకర్తలకు అభినందనలు. సంఘీభావం తెలిపిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు.”

నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ అధినేత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights