రానున్న ఐదు సంవత్సరాలలో అన్ని రంగాలలో తెలంగాణను అభివృద్ధి చేస్తాం:జగిత్యాల సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోది 

-అడుగడుగునా ప్రసంగం మధ్యలో మోడి మోడి అంటూ సభికుల నినాదాలు-నారీశక్తివందన్ పై మహిళల్లో ఉత్సాహం

‘నా తెలంగాణ కుటుంబసభ్యులందరికీ నమస్కారాలు’ అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడి తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

ఈ పార్లమెంట్ ఎన్నికల్లో భాజపా ప్రజలందరి ఆశీర్వాదంతో 400 సీట్లు గెలుచుకోబోతుందని… రానున్న ఐదు సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు.

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలోని గీతా విద్యాలయం మైదానంలో ఉదయం 11-20 గంటల నుంచి మధ్యాహ్నం 12-20 వరకు సుమారు గంటపాటు సాగిన బహిరంగ సభలో ఆయన పలు అంశాలపై మాట్లాడారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానంగా మహిళల చేయూత, యువత భాగస్వామ్యం, అన్ని వర్గాల ప్రజల ఆదరణతో.. మూడోసారి అధికారంలోకి రావడం తథ్యమన్నారు. తెలంగాణ రాష్ట్రం గత పది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ పార్టీ భ్రష్టు పట్టించిందని అన్నారు.

రానున్న ఐదు సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని పారిశ్రామిక, రైల్వే, రహదారుల విస్తరణ, మహిళలకు సామాజిక భద్రత-ఆర్థిక చేయూత తదితర అంశాల్లో ముందుకు తీసుకెళ్తామని ఇది మోదీ గ్యారంటీ అని అన్నారు.

కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ప్రసంగాన్ని ‘నా తెలంగాణ కుటుంబసభ్యులందరికీ నమస్కారాలు’ అని తెలుగులో ప్రారంభించి సుమారు 20 నిమిషాల పాటు సభను ఉత్తేజపరుస్తూ నారీ శక్తివందన్ కార్యక్రమం పై చైతన్యపరిచారు.శక్తి స్వరూపిణిలు మహిళలనీ, వారి ఆశీర్వాదంతో ముందుకు వెళుతూ, దేశాన్ని శక్తివంతంగా తీర్చిదిద్దుతున్నామన్నారు.

మోడీ ప్రసంగిస్తున్న సమయంలో మధ్య మధ్యలో సభలో “మోడీ.. మోడీ” అంటూ సభికుల నినాదాలతో సభా ప్రాంగణం మారుమ్రోగిపోయింది. ఇంకా మోడీ ప్రసంగిస్తూ గత పది సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం దగా పడ్డతీరు కాళేశ్వరం తదితర ప్రాజెక్టులో అవినీతి,  లిక్కర్ అవినీతి తదితర అంశాలపై మాట్లాడుతూ, ఎద్దేవా చేశారు..ఇక కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ను ఎటిఎంలా మార్చుకుందన్నారు.

ఈ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ధర్మపురి అరవింద్, కరీంనగర్ పార్లమెంట్ నుంచి బండి సంజయ్, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి గోమాస శ్రీనివాస్, తమ పార్టీ అభ్యర్థులని మే 13న పోలింగ్ ప్రక్రియలో ప్రజలందరూ పాల్గొని బిజెపికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని “ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్-అప్ కీ బార్ చార్ సౌ బార్”అంటూ ప్రధానమంత్రి మోడీ సభికులను ఉత్సాహపరిచారు.

తెలంగాణ ప్రజలునూతన శకాన్ని ప్రారంభించబోతున్నారన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఈ పది సంవత్సరాల కాలంలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు అందించామనీ, ఈ మధ్యకాలంలోనే ఆదిలాబాదు నుంచి దేశం మొత్తం మీద కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థానలు చేసుకున్నామన్నారు.

ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యంతో …దేశ సంక్షేమం కోసం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడానికి, ఆశావహమైన ప్రణాళికలను రూపొందించడానికి మరియు వాటిని సజావుగా అమలు చేయడానికి   మద్దతు నాకు అపారమైన శక్తిని ఇస్తుందని మోది అన్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights