కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులపై మంత్రి శ్రీధర్ బాబు చెప్పిన శుభవార్త 

హైదరాబాద్

ఈనెల 28 నుంచి ‘ప్రజా పాలన’ గ్రామసభల్లో రేషన్ కార్డుల దరఖాస్తులు కూడా తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.

గ్రామ సభల్లో కేవలం ఆరు గ్యారెంటీల దరఖాస్తులే స్వీకరిస్తారన్న అపోహలకు తెరదించి ఆరు గ్యారెంటీలతో పాటు రెవెన్యూ, రేషన్ కార్డులు, స్థానిక సమస్యలపై దరఖాస్తులు తీసుకుంటామని స్పష్టం చేశారు. 

అలాగే, సింగరేణి కార్మికుల సొంత ఇంటి కలను నిజం చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు . 

అలాగే, నూతన అండర్ గ్రౌండ్ బొగ్గుగనులను ఏర్పాటు చేస్తామని వివరించారు. కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి హైపవర్ కమిటీ వేస్తామని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights