ఈ నెల 22 వరకు అర్హులైన వారు ఓటు హక్కు నమోదుకు అవకాశం: జిల్లా స్వీప్ నోడల్ అధికారి కె.లక్ష్మినారాయణ

ఈ నెల 22 వరకు అర్హులైన వారు ఓటు హక్కు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉందని జిల్లా స్వీప్ నోడల్ అధికారి కె.లక్ష్మినారాయణ అన్నారు.

స్వీప్ (Systematic Voters’ Education and Electoral Participation program) కార్యక్రమాలలో భాగంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని అల్ఫోర్స్ జూనియర్ కళాశాల, రామకృష్ణ డిగ్రీ కళాశాలలో కళాజాత బృందం తమ పాటలతో ఓటరు అవగాహన కార్యక్రమంను గురువారం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా స్వీప్ నోడల్ అధికారి కె.లక్ష్మినారాయణ, జిల్లా స్వీప్ కమిటీ సభ్యుడు సిరిసిల్ల శ్రీనివాస్, కళాజాత బృందం నిర్వాహకులు, కళాకారులు రాగుల పరశురాంగౌడ్, బోగె అశోక్, మల్లిక్ తేజ, మహిపాల్, పలిగిరి రాజేందర్ తదితర మహిళా కళాకారులు, అయా కళాశాలల ప్రిన్సిపాల్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా స్వీప్ నోడల్ అధికారి కె.లక్ష్మినారాయణ మాట్లాడ్తూ…

ఈ జనవరి1 వరకు 17 సంవత్సరాలు నిండి, 18వ సంవత్సరంలోకి అడుగిడిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలన్నారు.ఓటు ప్రజాస్వామ్య పరిరక్షణ కు పునాదిలాంటిదన్నారు.ఓటు హక్కు ప్రాధాన్యత ను అవగాహన చేసుకుని, అర్హత కలిగిన యువత తమ తమ ఓటు హక్కును వినియోగించుకోవడమే గాకుండా, ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వామ్యం కావాలని విద్యార్థులను కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights