రాజన్న సిరిసిల్ల జిల్లా :

13, అక్టోబర్ 2023

అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపథ్యంలో…

నిరంతరం అప్రమత్తంగా ఉంటూ…
ఎన్నికల ఫిర్యాదుల పై వేగంగా స్పందించాలనీ కలెక్టర్,జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి అన్నారు.

శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం గ్రౌండ్ ఫ్లోర్ లో 24 గంటలు పని చేసే సమీకృత జిల్లా ఫిర్యాదుల కేంద్రం, ఎంసిఎంసీ , మీడియా సెంటర్ ల ను కలెక్టర్ అనురాగ్ జయంతి జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ తో కలిసి ప్రారంభించారు.

జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు నిస్వాక్షపాతంగా స్వేచ్ఛాయుత ప్రశాంత వాతావరణంలో జరగడంలో సమీకృత జిల్లా ఫిర్యాదుల కేంద్రం, ఎంసిఎంసీ , మీడియా సెంటర్ కీలక పాత్ర అన్నారు.

ఎన్నికలలలో ఓటర్లను ప్రలోభ పెడుతున్నట్లు ఫిర్యాదులు వచ్చినా.. మీడియా లో ఫేక్ న్యూస్ ప్రసారమైన, ఓటర్లు ఏదైనా సందేహాల నివృత్తి కి, సమాచారం కోసం సంప్రదించిన వెంటనే స్పందించాలని చెప్పారు. సి – విజిల్ ఫిర్యాదులను 100 నిమిషాల్లో పరిష్కరించాలన్నారు. ఎక్కడైనా మద్యం, డబ్బు లు పంపిణీ చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తే వెంటనే క్షేత్ర స్థాయిలో ఫ్లయింగ్ స్క్వాడ్ లను అప్రమత్తం చేయాలన్నారు. ప్రతి విభాగానికి వేరు వేరు గా రికార్డ్ లను నిర్వహించాలన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights