స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మానవత్వాన్ని చాటుకున్న డా.జి సురేంద్రబాబు

మండేపల్లి ప్రభుత్వ వయోవృద్ధుల ఆశ్రమంలో 161 వ జయంతి 

50 LPH వాటర్ ప్యూరిఫైడ్,60 లీటర్ SS రిఫ్రిజిరేటర్, పండ్లు మరియు దుప్పట్ల పంపిణీ

తాగునీటికి ఇబ్బంది పడుతున్న 26 మంది వయోవృద్ధులకు చేయూత

రాజన్న సిరిసిల్ల జిల్లా: (Reporter:Sampath P):

తంగళ్ళపల్లి మండలం మండేపల్లి వృద్ధాశ్రమంలో 26 మంది వృద్ధులు త్రాగునీటికి ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్న డా.జి. సురేంద్రబాబు మానవత్వంతో సహకారమందించారు. 

నరేన్ ఫౌండేషన్ మరియు అమృత, హిమాన్షి హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రభుత్వ వయోవృద్ధుల ఆశ్రమంలో స్వామి వివేకానంద 161 వ జయంతి సందర్భంగా సుమారు 60 వేల రూపాయల విలువగల 50 LPH వాటర్ ప్యూరిఫైడ్, 60 లీటర్ ల SS రిఫ్రిజిరేటర్, పండ్లు మరియు దుప్పట్లను అందజేశారు.

ఈ సందర్భంగా డా. సురేంద్రబాబు మాట్లాడుతూ..భారతమాతకు పూజ చేయాలని, పేదవాళ్లు,చదువు లేని వాళ్ళు, రోగంతో బాధపడే వారిని పూజిస్తే భారతదేశం జగద్గురువుగా ఎదుగుతుందన్న… స్వామి వివేకనంద స్ఫూర్తితో శుక్రవారం వయో వృద్ధాశ్రమంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. అలాగే హోం కో- ఆర్డినేటర్ మమత, సర్పంచ్ ఘనప శివజ్యోతి మాట్లాడుతూ.. త్రాగునీటి సమస్యను డా,జి. సురేంద్రబాబుకు తెలుపగానే తాత్కాలిక పరిష్కారం కాకుండా,శాశ్వతంగా నిలిచిపోయే భారీ పెట్టుబడితో వాటర్ ప్యూరిఫైడ్ మరియు రిఫ్రిజిరేటర్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. మునుముందు ఇలాంటి సామాజిక సేవలు మరెన్నో చేయాలని, నరేన్ ఫౌండేషన్ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని, జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగాలని, ఆయన చేసిన మేలు జన్మలో మర్చిపోలేము అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వికలాంగుల మరియు వయోవృద్ధుల శాఖ సూపరిండెంట్ అరుణ్ భాస్కర్, హోం కో-ఆర్డినేటర్ మమత, సర్పంచ్ గడప శివ జ్యోతి, ఎంపిటిసి భూస స్వప్న-లింగం, పేరెంటింగ్ కోచ్ విజయలక్ష్మి – ప్రదీప్, గుండ్లూరి నరేష్, గుండ్లూరి రవి,అమృత మరియు హిమాన్షి హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights