ఉత్సాహంగా సాగుతున్న దావోస్ పర్యటన-తెలంగాణ వైపు ఆకర్షితులౌతున్న పెట్టుబడిదారులు

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 54వ వార్షిక సమావేశంలో…

తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతమైన రీతిలో ఆవిష్కరణలు మరియు ప్రగతి కేంద్రంగా ప్రదర్శించేందుకు ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి, ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు మరియు సంబంధిత అధికారులు జయేష్ రంజన్, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వి. శేషాద్రి మరియు ఇతర ఉన్నతాధికారులతో కూడిన తెలంగాణ ప్రతినిధి బృందానికి దావోస్ లో పలు పారిశ్రామికవేత్తలు ఘనంగా స్వాగతం పలుకుతూ…తెలంగాణ లో పెట్టుబడుల వైపు ముందడుగు వేస్తున్నారు.

సిఎంతో కూడిన ఈ బృందం వ్యాపార, పరిశ్రమలు మరియు అక్కడి ప్రభుత్వ నాయకులతో చర్చిస్తూ…తెలంగాణ రాష్ట్రం అందిస్తున్న విస్తృత పెట్టుబడి అవకాశాలను వివరిస్తోంది..

 పెట్టుబడులకు, సుస్థిర వృద్ధికి దేశంలోనే తెలంగాణను అత్యుత్తమంగా తీర్చిదిద్దాలన్న తెలంగాణ  ప్రభుత్వ నిబద్ధత, అన్ని సమావేశాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

 సిఎం రేవంత్ రెడ్డిని కలిసిన ప్రపంచ వ్యాపార, రాజకీయ మరియు ఆలోచనాపరులు తెలంగాణను గొప్ప, సంపన్న, సమ్మిళిత, సుస్థిర మరియు న్యాయబద్ధమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే దార్శనికత పట్ల వారు ఆకర్షితులౌతున్నారు.

 #WEF2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights