స్విట్జర్లాండ్‌లోని జూరిచ్ విమానాశ్రయంలో సిఎం రేవంత్ రెడ్డి, ఐటి మంత్రి శ్రీధర్ బాబులకు పలువురు ప్రవాసీ తెలంగాణ ప్రముఖుల ఘన స్వాగతం

స్విట్జర్లాండ్‌లోని జూరిచ్ విమానాశ్రయంకు చేరుకున్న తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డితో పాటుగా ఐటి మంత్రి శ్రీధర్ బాబులకు పలువురు ప్రవాసీ తెలంగాణ ప్రముఖులు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబులు ప్రవాసీ తెలంగాణ ప్రముఖులకు కృతజ్ఞతలు తెలిపారు.

సోమవారం మధ్యాహ్నం స్విట్జర్లాండ్‌లోని జూరిచ్ విమానాశ్రయంలో పలువురు ప్రవాసీ తెలంగాణ ప్రముఖులతో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి కాసేపు సంభాషించడం ఆనందంగా ఉందని సిఎం రేవంత్ రెడ్డి ఒక అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.

సమ్మిళిత, సంతులిత అభివృద్ధి ద్వారా ప్రజలందరి పురోగతికోసం ఒక నూతన తెలంగాణ నిర్మాణానికై మొదలైన తమ ప్రభుత్వ ప్రయత్నంలో భాగస్వాములవడం పట్ల వారు ఎంతో ఉత్సాహాన్ని వ్యక్తపరిచారన్నారు. 

మన రాష్ట్ర పెవిలియన్‌ వేదికగా నేటినుండి తెలంగాణకు పెట్టుబడులు ఆకర్షించే తమ కార్యక్రమాలు ప్రారంభించనున్నామని వివరించారు. ఈ దిశగా సోమవారం దావోస్‌లో అనేక కీలక సమావేశాల్లో పాల్గొంటున్నాం అని సిఎం రేవంత్ రెడ్డి తన అధికారిక ప్రకటనలో వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights