2 లక్షల ఉద్యోగాల భర్తీకి చర్యలు -ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

-ప్రతి జిల్లాలో స్కిల్ సెంటర్

-యువతలో నైపుణ్యాభివృద్దికి కాంగ్రెస్ సర్కార్ పెద్దపీట

2 లక్షల ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టడంతో పాటుగా యువత నైపుణ్యాభివృద్ధికి కాంగ్రెస్ సర్కార్ పెద్దపీట వేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఈ మేరకు యువతకు శిక్షణ ఇచ్చేందుకు ప్రతి జిల్లా కేంద్రంలో స్కిల్ సెంటర్లు, స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. శుక్రవారం జాతీయ యువజన దినోత్సవం, స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని సికింద్రాబాద్ లోని డైరెక్టర్ అండ్ కమిషనర్ యూత్ సర్వీసెస్ ప్రతి జిల్లాలో స్కిల్ సెంటర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ…స్వామి వివేకానంద ఆలోచనలు, మార్గం యువతకి ఆద ర్శమని తెలిపారు. యుక్త వయసులో మంచి విద్య, ఉద్యోగం అవసరమని అన్నారు. యువత సమస్యలను పరిష్కరించాలన్న భావనతో ఉద్యోగ కల్పన గురించి ప్రభుత్వం ఆలోచన చేస్తోందని స్పష్టం చేశారు.

ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపడతామనీ..ప్రభుత్వ రంగంలో 2 లక్షల ఉద్యోగాల భర్తీకి కూడా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

ప్రైవేటు రంగంలోనూ…

ప్రైవేటు రంగంలోనూ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాల కల్పన చర్యలు ముమ్మరం చేశామన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలి జెన్స్ లో డిగ్రీ చదువుకున్న వారికి సైతం ఒక ప్రత్యేక కోర్సు అందుబాటులోకి తీ సుకువస్తున్నామని, ఆ రంగంలో కూడా యువతకి ఉపాధి కల్పిస్తే రాష్ట్రం అభివృ ద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. సానుకూల దృక్పథంతో ముందుకెళ్లాలని యువతకు దిశానిర్దేశం చేశారు. 

ఒక్క హైదరాబాద్ లోనే కాకుండా జిల్లా కేంద్రాల్లోనూ జాబ్ మేళాలు ఏర్పాటు చేస్తామని మంత్రి ఇచ్చారు. పదేళ్లలో ఒక దశా దిశ లేకుండా రాష్ట్రం నడిచిందని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక లక్ష్యంతోముందుకు సాగుతోందన్నారు. యువత కూడా ఒక లక్ష్యంతోముందుకు వెళ్లాలని, వివేకానంద స్ఫూర్తి తో లక్ష్య సాధన లో విజయం సాధించాలని ఆశించారు.

మాదక ద్రవ్యాల నివారణకు చర్యలు..

గ్రామీణ ప్రాంతంలో యువత పెడ దారిపట్టే మార్గాలున్నందున మాదక ద్రవ్యాల నివారణకు గట్టి చర్యలు తీసు కుంటున్నామని మినిస్టర్ శ్రీధర్ బాబు తెలిపారు. అందుకోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేసి డ్రగ్స్ కు బ్రేక్ పెట్టేలా నిర్ణయం తీసుకున్నారన్నా రు. గత ప్రభుత్వం ఉద్యోగ భర్తీ పట్ల నిర్ల క్ష్యం వహించిందన్న మంత్రి.. ప్రతి జిల్లా కేంద్రం లో స్కిల్ సెంటర్, స్కిల్ యూని వర్సిటీస్ ఏర్పాటు చేసేప్రక్రియ ప్రణాళిక రూపొందిస్తున్నామని వెల్లడించారు. పరిశ్రమల స్థాపన, వాటికి కావాల్సిన నైపుణ్యాన్ని వెలికతీసేందుకు స్కిల్ యూ నివర్సిటీస్ ఏర్పాటు చేసుకోబోతున్నామ ని తెలిపారు.

రాబోయే ఐదేళ్లలో మానవ వనరుల రంగంలో తెలంగాణ ప్రపంచం లోనే అగ్ర స్థానంలో ఉండబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సెట్విన్ ఆధ్వ ర్యంలో నిర్వహించిన ఈ జాబ్ మేళాలో ప్రిన్సిపల్ కార్యదర్శి సవ్యసాచి ఘోష్, సెట్విన్ ఎండీ వేణుగోపాల్ పాల్గొనగా 5వేల ఉద్యోగాల కల్పనకు నిర్వహించిన జాబ్ మేళాలో 80 కంపెనీలు పాల్గొన గా 6,500 మంది యువత రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

కాగా 35 వేల మందికి ఇప్పటికే పలు జాబ్ మేళా ద్వారా ఉద్యో గాలు అందించినట్టు యూత్ సర్వీస్ విభాగం అధికారులు మంత్రికి తెలియ జేశారు. మేళ లో ఉద్యోగం కోసం వచ్చిన యువతతో మంత్రి ప్రత్యేకంగా కలిసి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights