కేటీఆర్ మీటింగ్ కు హాజరయ్యే ఉద్యేశ్యంతో వాకౌట్
— గీకురు రవీందర్, జెడ్పి ఫ్లోర్ లీడర్

చిగురుమామిడి, (M.KANAKAIAH)

కరీంనగర్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం 45 నిమిషాలకే బిఆర్ఎస్ జెడ్పిటిసిలు వాకౌట్ చేయడం, అర్ధాంతరంగా సమావేశం వాయిదా వేయడం వెనుక అంత్యర్యం ఏమిటో జిల్లా ప్రజలకు జవాబివ్వాలని జడ్పీ ఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్ బిఆర్ఎస్ నేతలను డిమాండ్ చేశారు.

చిగురుమామిడి మండల కేంద్రములో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జెడ్పి ఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్ మాట్లాడుతూ…. బిఆర్ఎస్ పార్టీ జెడ్పిటిసి సభ్యులు జెడ్పి సమావేశాన్ని అర్ధాంతరంగా వాయిదా వేయాలని, ముందస్తుగా కూడబలుక్కొని వ్యూహత్మకంగా వ్యవహరించారని ఆరోపించారు. సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికి మేడిగడ్డకు మరమ్మత్తులు చేయాలని సభ్యుల కోరిక మేరకు ఏకగ్రీవ తీర్మానం చేయడం, తీర్మానించిన కొద్ది సేపటికి మేడిగడ్డకు మరమ్మతులు చేపట్టనందుకు నిరసనగా నినాదాలు చేస్తూ వాకౌవుట్ చేయడంలో ఆంతర్యం ఏమిటో చెప్పాలన్నారు.

బిఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ కోసం కేటీఆర్ సన్నాహక సమావేశానికి హాజరయ్యేందుకు ఉద్యేశ పూర్వకంగానే వాకౌట్ చేశారని దుయ్య బట్టారు. బిఆర్ఎస్ పార్టీ జెడ్పిటిసి సభ్యులకు పార్టీ మీటింగ్ పై ఉన్న శ్రద్ధ, ప్రజా సమస్యలను పరిష్కరించడములో లేకపోవడం శోచనీయమన్నారు.

వివిధ శాఖల అధికారులతో 29 శాఖలపై ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా జిల్లా ప్రజలకు రాబోయే వేసవిలో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా తగు నివారణ చర్యలు తీసుకోవాల్సిన భాద్యత ఉందన్నారు. మెడిగడ్డకు జిల్లా పరిషత్ సమావేశానికి సంబంధమే లేదని, ఇప్పటికే ప్రభుత్వం చంద్రశేఖర్ అయ్యర్ ఆధ్వర్యంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటి నిపుణుల కమిటీ వేసిందనే విషయాన్ని గౌరవ సభ్యులు తెల్సుకోవాలన్నారు.

గతములో ఎప్పుడు కూడా జడ్పీ సమావేశాలు సజావుగా జరిగింది లేదని, బిఆర్ఎస్ సభ్యులు ఇప్పటికైనా ప్రజా సమస్యల పరిష్కార దిశగా ఆలోచించాలని హితవు పలికారు. త్రాగునీటి సమస్యపై ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని జడ్పీ చైర్ పర్సన్ ను కోరారు.

ఈ సమావేశములో జిల్లా ప్రధాన కార్యదర్శి చిటుమల్ల రవీందర్, డిసిసి అధికారప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత, బిసీ సెల్ మండల అధ్యక్షుడు పొన్నం సంపత్, మాజీ ఎంపీటీసీ చీల లక్ష్మారెడ్డి, నాయకులు ఆనంద్, పోటు మల్లారెడ్డి, కవ్వంపల్లి సంజీవ్, కాటం సంపత్ రెడ్డి, సంజీవరెడ్డి, దుడ్డెల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights