ఫేర్ వెల్ లో అలరించిన గర్ల్స్ హై స్కూల్ విద్యార్థినిలు

స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల జగిత్యాలలో గురువారం సాయంత్రం 9వ తరగతి విద్యార్థులు పదవ తరగతి విద్యార్థులు వీడ్కోలు సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు గడ్డం బాలకిషన్ సభాధ్యక్షులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పాఠశాలలో మూడు మీడియం (తేమీ,ఈమీ, ఊమీ)లలో విద్యార్థుల సంఖ్య- 301, బోధన బోధనేతర సిబ్బంది- 22, ఖాళీలు ఏడు, మొత్తం- 29 పోస్టులు ఉన్నాయని వివరించారు.

మన ఊరు మనబడి కింద శిథిలావస్థలో ఉన్న బిల్డింగు పడగొట్టడం, కొత్త బిల్డింగు నిర్మాణము పునాదుల్లోనే ఆగిపోయిందన్నారు. క్లాస్ రూమ్స్, టాయిలెట్స్ రూమ్స్ కొరతను అధిగమిస్తూ, పాఠశాల విద్యా సంవత్సరంను కొనసాగిస్తున్నామన్నారు.

ఎస్.ఎస్. సి విద్యార్థులు గత సంవత్సరము 70 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఈ సంవత్సరం తే.మీ, ఈ.మీ, ఉ.మీ లతో మొత్తం- 70 మంది విద్యార్థులు ఎస్ఎస్ సి బోర్డు ఎగ్జామ్స్ రాయబోతున్నారన్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు తొలిమెట్టు పదవ తరగతే నన్నారు. ఈ విద్యా సంవత్సరము ఎస్ ఎస్ సి విద్యార్థులు 100% ఫలితాలతో, 10/10 జీపీఏ సాధించడానికి పదవ తరగతి బోధిస్తున్న ఉపాధ్యాయ బృందం అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు.

అనంతరం, పదవ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్నులు పంపిణీ చేశారు. పాఠశాల ఉపాధ్యాయులు రామానుజన్, కృష్ణయ్య మాట్లాడుతూ సమావేశంలో ఎస్ ఎస్ సి పరీక్షలు రాయబోయే పదవ తరగతి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఈ ఫేర్ వెల్ కార్యక్రమం విజయవంతం చేసిన ఉపాధ్యాయ బృందానికి ప్రధానోపాధ్యాయులు గడ్డం బాల కిషన్ ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights