బిజెపి నాయకులు కాంగ్రెస్ చరిత్ర తెల్సుకొని మాట్లాడాలి…ప్రెస్ మీట్ లో ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి

బిజెపి అవాకులు చవాకులు పేలితే రావణాసురుడికి పట్టిన గతే పడుతుందనీ..

అరవింద్! కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలుసుకో అని ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు..

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో  ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ..బిజెపి విజయ సంకల్ప యాత్రలో భాగంగా జగిత్యాలలో బిజెపి నాయకుల ప్రసంగం ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా, రెచ్చిపోయి ప్రసంగించడం అభివృద్ధి అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

సమాజంలోని నిరుపేద వర్గాల సంక్షేమం కోసం  పథకాలు చేపట్టి విజయ సంకల్పయాత్ర చేపట్టాలన్నారు..

దేశ భక్తులు..దేశ ద్రోహులు అంటూ రెచ్చగొట్టే ప్రసంగం చేయడం సరికాదన్నారు.

కాంగ్రెస్ చరిత్ర తెలుసుకోవాలనీ..పాకిస్థాన్ తో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో యుద్ధం చేసినప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్న బిజెపి నాయకులు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.

పాకిస్థాన్ పై విజయ పతాకం ఎగుర వేసిన ఘనత కాంగ్రెస్ దనీ..చరిత్ర పుటలు తిరగేస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు..దేశ సమగ్రత, ఐక్యత కోసం ప్రాణాలు అర్పించిన త్యాగమూర్తి ఇందిరా గాంధీయే అన్నారు..

బిజెపి నాయకులు అటల్ బిహారీ వాజపేయి ఇందిరా గాంధీని అపర కాళీమాత అని కొనియాడారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గుర్తు చేశారు.

రాముడి పేరు చెప్పడం కాదు రాముడి ఆలోచన కు అనుగుణంగా పాలన కొనసాగాలనీ.. ప్రజాభిప్రాయం గౌరవించడంలో రాముడు ఆదర్శప్రాయుడనీ, పితృవాక్య పరిపాలకుడు..రాముడితో  మోడీ కి పోలికనా అని అన్నారు…

విదేశాల్లో మూలుగుతున్న నల్ల ధనం తీసుకువచ్చి 15 లక్షలు నిరుపేదల ఖాతాలో వేస్తామన్న మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మీ అధికార తాపత్రయం కోసం దేశాన్ని పెట్టుబడి దారులకు కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేశ రాజధాని సరిహద్దుల్లో కనీస మద్దతు ధర అమలు చేయాలని ధర్నా చేస్తే స్పందించడం లేదన్నారు..

నాలుగేళ్లు మరిచి ఎన్నికలు సమీపిస్తున్నాయని మల్లాపూర్ చక్కర ఫ్యాక్టరీ ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు.

మూతబడిన ఫ్యాక్టరీలు పునః ప్రారంభించేందుకు ఏం చేశారో చెప్పాలన్నారు.ఇన్ని రోజులు ఫ్యాక్టరీ ని సందర్శించాలని ఎందుకు ఆలోచన లేదు. ఇప్పుడు చక్కర ఫ్యాక్టరీ సందర్శన చేయడం ఏమిటి.. అని నిలదీశారు.

చక్కర ఫ్యాక్టరీ ప్రారంభించింది కాంగ్రెస్ అని మరిచిపోవద్దనీ..చరణ్ సింగ్ రైతులను రుణ విముక్తులను చేయడానికి లక్ష మాఫీ చేశారని గుర్తు చేశారు.బిజెపికి  మాత్రం రైతుల సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ది లేదన్నారు.

వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ పథకం ప్రవేశ పెట్టిందన్నారు.

బిజెపి పదేళ్లలో బలహీన వర్గాలకు  సంక్షేమం కోసం చేపట్టిన పథకాలు ఏమిటో చెప్పాలనీ..జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించాలనే ఆలోచన ఎందుకు లేదన్నారు.

కాంగ్రెస్ పార్టీ కులగణనతో పాటు రిజర్వేషన్ పెంపు కోసం కృషి చేస్తామన్నారు.డాక్టర్ అంబేడ్కర్ ఆలోచనకు అనుగుణంగా బలహీన వర్గాలకు రిజర్వేషన్ పెంచాల్సిన అవసరం లేదా అని నిలదీశారు.

మాటల్లో బలహీన  వర్గాల సంక్షేమం కాదు..చేతల్లో కావాలనీ..చట్టం లోని లొసుగులు ఆసరా చేసుకొని బలహీన వర్గాలకు చెందిన సీట్లో ఇతర వర్గాలు కొనసాగితే కిషన్ రెడ్డి ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు..

బలహీనవర్గాల హక్కులను కాపాడేందుకు చట్టంలో మార్పులు చేసి, వారి హక్కుల కోసం కాంగ్రెస్ కృషి చేసింది అన్నారు.

రాజ్యాంగ బద్దంగా దళితులు, మహిళలు, బలహీన వర్గాల హక్కులు కాపాడేందుకు చట్టంలో మార్పులు చేసి, హక్కులు కాపాడినం అన్నారు.

ఉచిత బస్సు ప్రయాణం పేరిట ప్రభుత్వ కార్యక్రమం చేపడితే మహిళలు అమ్ముడు బోయారు అంటారా.. ఇదేనా మహిళల పట్ల మీకున్న గౌరవం అంటూ! మహిళలను అవమానించేలా మాట్లాడితే  సహించేదిలేదని హెచ్చరించారు.

మహిళలకు సౌకర్యం కల్పించరు..కల్పిస్తే ఓర్వరు..ఇదేనా బిజెపి ఆలోచన విధానం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆడ బిడ్డలకు సిలిండర్ రు.500 అందించబోతున్నం. వచ్చే నెల నుండి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నాం అన్నారు.

శ్రీరాముడి ఆలోచన విధానం అమలు చేసే వారికి మాత్రమే ఓట్లు అడిగే నైతిక హక్కు ఉంటది…బిజెపి లో అటల్ బిహారీ వాజపేయి, ఎల్ కె అద్వానీ.  మురళి మనోహర్ జోషి వంటి వారు ఉన్నారన్నారు.

ఓట్ల కోసం రాముడి పేరు చెప్తే దేవుడు సహించడు..ప్రజాస్వామ్యయుతంగా, కుల మతాలకు అతీతంగా పని చేయాలన్నారు.

దేశ సమగ్రత, ఐక్యత కోసం ప్రాణ త్యాగం చేసిన ఘనత ఇందిరా గాంధీ ది…దేశంలో శాంతి నెలకొల్పాలని  రాజీవ్ గాంధీ ఎల్ టీ టీ ఈ ఉగ్రవాదులకు బలి అయ్యారన్నారు.

ప్రభుత్వ రంగ సంస్థలు బలోపేతం కోసం కాంగ్రెస్ కృషి చేస్తే, మోడీ పాలనలో ప్రభుత్వ రంగంలోని సంస్థలను  ప్రైవేటీకరణ చేస్తున్నారు.. ఇదేనా  దేశ అభివృద్ధి అన్నారు.

అవినీతికి కళ్లెం వేసే విధంగా సమాచార హక్కు చట్టం తీసుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ అన్నారు.

శ్రీరాముడి ఆలయం నిర్మించారు సంతోషం అనీ…నాలుగు దశాబ్దాలుగా ఆలయాల నిర్మాణాలు చేపడుతున్నాం అనీ…జగిత్యాలలో  కోదండ రామాలయం, ఎల్లమ్మ ఆలయాలు దగ్గులమ్మ ఆలయం నాలుగు దశాబ్దాలుగా ఎన్నో ఆలయాలు నిర్మించినమన్నారు.

హిందూ మతం పట్ల నాకున్నంత విశ్వాసం ఎవరికి లేదనీ..దైవ భక్తి మాటల్లో కాదు నేను ఆచరణలో చేసి చూపిస్తున్నా అన్నారు.

రెండేళ్ల నుండి ఎమ్మెల్సీ కవిత కేసు సీరియల్ నడిచినట్టు నడుస్తుంది…ఈ డీ అధికారులు  కవితకు నోటీస్ కు ఇస్తే  విచారణ కు హాజరు కావడం లేదు..ఇది బిజెపి బీ ఆర్ ఎస్ మద్య అంతర్గత ఒప్పందానికి నిదర్శనం కాదా అన్నారు.

ఇకనైనా బిజెపి నాయకులు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హితవు పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights