గల్ఫ్ మృతుడి కుటుంబానికి ‘సాటా’ సాయం

జగిత్యాల: సౌదీలో గుండెపోటుతో మరణించిన జగిత్యాల పట్టణ వాసి రఫీయోద్దీన్ కమాల్ కుటుంబానికి సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (సాటా) అండగా నిలిచింది.

‘సాటా’ మహిళా సభ్యురాళ్ళు విరాళంగా పంపిన రూ.1 లక్షా 50 వేలు జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ బి.ఎస్. లత శనివారం మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు. మృతుని భార్య సుమేరా ఈ సందర్భంగా సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ ‘సాటా’ కు కృతజ్ఞతలు తెలియజేశారు. 

కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఎడారి దేశంలోని తెలుగు వారందరి సంక్షేమం, సాంస్కృతిక వికాసం కొరకు తమ సంస్ధ కృషి చేస్తుందని ‘సాటా’ప్రతినిధులు వి.మల్లేషన్, ముజ్జమ్మీల్, రంజీత్, అబ్దుల్ రఫీక్, సైమన్ పీటర్ లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘సాటా’ సేవలను ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు మంద భీంరెడ్డి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ సభ్యులు, జర్నలిస్ట్ సిరిసిల్ల శ్రీనివాస్ కొనియాడారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights