రాజన్న సిరిసిల్లజిల్లా: (Sampath Panja)

మాజీ మంత్రి కెటిఆర్ పి ఎ కుంబాల మహేందర్ రెడ్డికి చెందిన కారు డీ కొని వృద్దుడికి గాయాలు.ఆస్పత్రికి తరలింపు.

-సీసీ పుటేజ్ ల ద్వారా గుర్తించిన ముస్తా బాద్ పోలీసులు

కారు డ్రైవర్ అజయ్ పై పోలీసులు కేసు నమోదు

శనివారం సాయంత్రం అయిదు గంటల ప్రాంతంలో ముస్తాబాద్ మండలం బదనకల్ స్టేజ్ వద్ద మహేందర్ రెడ్డి కీ సంబందించిన TS 09 Eu 6008 అనే నంబర్ గల క్రేటా కారు ఢీ కొట్టగా వృద్ధుడి కుడి కాలు విరిగిపోయింది.

వివరాలు ఇలా ఉన్నాయి. నారాయణరావుపేట మండలం బంజపల్లి గ్రామానికి చెందిన దొందడి మల్లయ్య బదనకల్ స్టేజ్ వైపు ద్వి చక్ర వాహనం పై వస్తుండగా మల్లయ్య కు క్రేట కారు ఢీ కొత్తగా కుడి కాలు విరిగింది. ప్రస్తుతం మల్లయ్య సిరిసిల్ల లోని సురక్ష ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వాహనంతో సహా పారిపోగా ముస్తాబాద్ పోలీసులు సీసీ కెమెరాల పుటేజీల ద్వారా గుర్తించి ప్రమాదానికి కారణమైన కారు మాజీ మంత్రి కెటిఆర్ పి ఎ కుంబాల మహేందర్ రెడ్డి కి సంబందించిన కారు గా గుర్తించినట్లు సమాచారం. ప్రమాద సంఘటన పై బాధిత కుటుంబం ముస్తా బాద్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ అజయ్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights