ఈ నెల 22 వరకు అర్హులైన వారు ఓటు హక్కు నమోదుకు అవకాశం: జిల్లా స్వీప్ నోడల్ అధికారి కె.లక్ష్మినారాయణ
ఈ నెల 22 వరకు అర్హులైన వారు ఓటు హక్కు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉందని జిల్లా స్వీప్ నోడల్ అధికారి కె.లక్ష్మినారాయణ అన్నారు.
స్వీప్ (Systematic Voters’ Education and Electoral Participation program) కార్యక్రమాలలో భాగంగా జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ కేంద్రంలో కళాజాత బృందం తమ పాటలతో ఓటరు అవగాహన కార్యక్రమంను నంది చౌక్, బస్టాండ్ చౌరస్తాలో వద్ద నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా స్వీప్ నోడల్ అధికారి కె.లక్ష్మినారాయణ, మున్సిపల్ కమిషనర్ టి.రాజేశ్వర్, జిల్లా స్వీప్ కమిటీ సభ్యుడు సిరిసిల్ల శ్రీనివాస్, కళాజాత బృందం నిర్వాహకులు, కళాకారులు రాగుల పరశురాంగౌడ్, బోగె అశోక్, మల్లిక్ తేజ, మహిపాల్, పలిగిరి రాజేందర్ తదితర కళాకారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా స్వీప్ నోడల్ అధికారి కె.లక్ష్మినారాయణ మాట్లాడ్తూ…ఈ జనవరి1 వరకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలన్నారు.ఓటు ప్రజాస్వామ్య పరిరక్షణ కు పునాదిలాంటిదన్నారు.
Sircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee member of Indian Red Cross society.