శుభోదయం…Siri….

జీవితంలో ఒదిగి ఉండగలిగిన వారే త్వరగా ఎదుగుతారు,

పరిస్థితులు ఎంతగా అణచి వేసినా అంతిమ విజయం వారిదే,

కొన్ని కష్టాలు అనుభవాలను ఇచ్చి మనిషిని శక్తివంతుడిగా మారుస్తాయి,

ఒదిగి ఉండటం చిన్నతనం కాదు, రేపటి విజయానికి తొలిమెట్టు…

నిన్ను నిన్నుగా ఇష్టపడే వాళ్లకు నీవంటే ఏమిటో చెప్పనవసరంలేదు.

నిన్ను ఇష్టపడని వాళ్లకు నీవంటే ఏమిటో చెప్పిన అర్థం కాదు,

మనం మంచి వాళ్లుగా జీవిస్తే చాలు,
దానిని నిరూపించుకోవాలని ప్రయత్నించనవసరం లేదు,

విలువ లేని వారితో వాదించటం, వాళ్ళ మాటలకి స్పందించటం వల్ల వాళ్ళ విలువ మనం పెంచడమే అవుతుంది…

కష్టాలు గాని సుఖాలు గాని గడిచిన కొద్దీ అలవాట్లు గా మారిపోతాయి,
తరువాత వాటిని గురించి ఆలోచించడానికి కూడా ఏమీ ఉండదు..

అసూయ, ద్వేషాలు, అకారణ కోపాలు మానసిక రోగాలు, మనిషి ఎదుగుదలను అవి అడ్డంకులు,

సంతోషం, సహనం, శాంతం అనే మూడు గుణాలు ఎదుగుదలకు ఉపయోగపడతాయి…
మనం కోరినప్పుడు పౌర్ఙమి రాదు.. ఇష్టపడినప్పుడు వసంతం రాదు.. చూడాలనుకున్నప్పుడు
ఇంద్రధనస్సు రాదు.. అలాగే, ఆశించినప్పుడు ఆత్మీయులు మనకు దొరకరు.. జీవితం ఆనందమయం అయ్యేది
కోరుకొన్నది పొందినప్పుడే కాదు
పొందినది ఆస్వాదించినప్పుడు కూడా..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights