ధర్మపురి అసెంబ్లీ ప్రజలు ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుంటారు:

బీజేపీ యస్సీ మోర్చ రాష్ట్రకార్యదర్శి
ఓరగంటి చంద్రశేఖర్

ధర్మపురి అసెంబ్లీలోని యస్సీలలో దళిత బంధు పేరుమీద ఈశ్వర్ కొట్లాటలు పెడుతున్నాడని
చాట్లో తౌడు పోసి కుక్కలకు కొట్లాట పెట్టినట్టు విభజించి పాలించు అన్న చందంగా ఉందని
భారతీయ జనతా పార్టీ యస్సిమోర్చ రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్ అన్నారు
ధర్మపురి పట్టణంలోని యస్ ఆర్ అర్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ
సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న ఈశ్వర్
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ప్రతి దళిత కుటుంబానికి దలిత బంధు ఇప్పించినట్లు ధర్మపురి అసెంబ్లీలోని యస్సీలకు ప్రతి కుటుంబానికి దళిత బందు ఎందుకు ఇప్పటివరకు ఇవ్వలేదో ఈశ్వర్ చెప్పాలన్నారు.

తన దగ్గర పని చేసే వాళ్లను తనకు జై కొట్టే వాళ్లకు మాత్రమే దళిత బంధు లబ్ధిదారులుగా ప్రకటించడం వెనక ఉన్న అంతర్యం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేసారు.

అంతే కాకుండా ధర్మపురి అసెంబ్లీలోని పెగడపల్లి మండలంలో అనేక గ్రామాల రైతుల వందల ఎకరాలు కాలేశ్వరానికి సంబంధించిన లింకు2 ప్రాజెక్టు కింద తీసుకొని ఏకరానికి 36 నుండి 40 లక్షలు పలుకుతున్న భూములను కేవలం ఎనిమిది,తొమ్మిది లక్షలు ఇచ్చి చేతులు దులుపుకొని తీవ్ర అన్యాయం చేశారన్నారు.

ధర్మపురి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో గత కొన్ని రోజులుగా కనీసం రక్త పరీక్షలు చేసే నిపుణులు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రజలు,రోగులు అనేక ఇబ్బందులు పడుతుంటే కూడా పట్టించుకోని మంత్రి ఈశ్వర్ తీరు ధర్మపురి అసెంబ్లీ పట్ల వారికున్న వివక్షతకు నిదర్శనం అని అన్నారు.

అంబేద్కర్ భవనం పేరు మీద అనేక సంవత్సరాలుగా కాలయాపన చేస్తూ ఇప్పటివరకు ఆ భవనాన్ని కనీసం మొదలు పెట్టలేదని అందుకు కారణాలు ఏమిటో చెప్పాలని కొప్పుల ఈశ్వర్ ను ప్రశ్నించారు

ఇలా ఏ విషయంలో చూసినా ధర్మపురి అసెంబ్లీ వెనుకబాటుతనానికి,వివక్షతకు,అన్యాయానికి గురవుతూ ఉన్నది కారణం ఏంటని ఆలోచిస్తే కొప్పుల ఈశ్వర్ ఈ ప్రాంత స్థానికుడు కాకపోవడమేననీ అన్నారు
ప్రాంతంలో గనక పుట్టి,పెరిగినట్లైతే ఈ ప్రాంతంలో చదువుకున్నట్లయితే, ఈ ప్రాంతం మీద ప్రేమ ఉండునేమో గాని..
రిజర్వేషన్ చేంజ్ అయితే ఈ అసెంబ్లీతో కొప్పుల ఈశ్వర్ కు సంబంధం లేదు కాబట్టి ఇక్కడ ప్రజల సంక్షేమాన్ని విస్మరిస్తూ మోసపు హామీలతో ఓట్లను దండుకొని అదికారాన్ని పొంది కాలం వెళ్లదీశారని అన్నారు.

ధర్మపురి అసెంబ్లీ ప్రజలు మేధావులని రాబోయే రోజుల్లో ధర్మపురి ఆత్మగౌరవాన్ని నిలబెడతారని చంద్రశేఖర్ తెలియచేశారు.

ఈ సమావేశంలో ధర్మపురి బీజేపీ అసెంబ్లీ కో కన్వీనర్ బండారి లక్ష్మణ్,జిల్లా కార్యదర్శి పిల్లి శ్రీనివాస్, నాయకులు గాజు భాస్కర్, దివిటీ శ్రీధర్,తిర్మందస్ సత్యనారాయణ,కుమ్మరి తిరుపతి,పల్లర్ల సురేందర్,కొడగంటి కిరణ్, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights