కరీంనగర్

ప్రతిభ ఉండి ఆర్థికలేమితో బాధపడుతున్న ఓ నిరుపేద విద్యార్థిని ఉన్నత చదువుకు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు చేయూతనందించాడు. 

కరీంనగరంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల సవరాన్, కోతిరాంపూర్ విద్యార్థిని నూనె అక్షయ ఈ సంవత్సరం టెన్త్ 9.8 జీపీఏ పొంది… ట్రిపుల్ ఐటీ బాసరలో మొదటి స్థానంలో ఎంపికైంది. నిరుపేద అయిన నూనె అక్షయ కుటుంబానికి హాస్టల్ ఫీజు, ఇతరత్రా ఖర్చులు భరించే స్థోమత లేకపోయింది. తల్లి కూరగాయలు అమ్ముతూ కుటుంబ పోషణ వెళ్లదీస్తుంది. తండ్రి గుమాస్తాగా పని చేస్తున్నాడు. 

పాఠశాల ఉపాధ్యాయుడు ఎండీ జావిద్ హుస్సేన్ ఈ విషయాన్ని తెలుసుకుని, ప్రత్యక్షముగా పరిశీలించారు.సాయమందిస్తే ఆడపిల్ల చదువుకుంటుంది..ఉన్నత ఆశయాలతో ముందుకు వెళుతుందన్న ఉద్దేశ్యంతో… ముందుకు వచ్చి అక్షయను ట్రిపుల్ ఐటీ, బాసర లో చేర్చడానికి తనకు తెలిసినవారందరినుండి విరాళాలు సేకరించారు.కుమారి అక్షయ చదువు, ఆర్ధిక పరిస్థితి గురించి వివరించి దాతలను సమీకరించాడు. 

అలా ఒక్కో రూపాయి సమీకరించి, రూ.1 లక్ష 20 వేలు సేకరించి ఆ మొత్తాన్ని అమ్మాయి బ్యాంకులో జమ చేశారు. 

అక్షయ ఆరు సంవత్సరాల విద్యాభ్యాసానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. 

అక్షయ ఆరు సంవత్సరాల ఫీజు రియంబర్స్మెంట్ పోగా మిగిలిన రూ.36 వేలను కార్పొరేటర్ వంగపల్లి రాజేందర్ అక్షయ తండ్రికి జావిద్ ద్వారా అందించారు.

అంతేకాకుండా, కుమారి అక్షయను స్వయంగా కరీంనగర్ నుండి డ్రైవ్ చేసుకుంటూ.. తన కారులో సుమారు 380 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి,  దగ్గరుండి, బాసర ట్రిపుల్ ఐటి లో చేర్పించిన ఒక సంతృప్తి తో కరీంనగర్ చేరుకున్నాడు..

ఇంతే కాకుండా ఉపాధ్యాయ వృత్తిలో ఉండుకుంటూ నేటి వరకు ఏడుగురిని ఇంజనీరింగ్ దాతల ద్వారా పూర్తి చేపించాడు. ప్రస్తుతం ఆరుగురు జీవితంలో స్థిరపడినారు. ఇలా ఉదార స్వభావాన్ని చూపించి పేద విద్యార్థుల చదువుకు ఆర్థిక సహాయం దాతల ద్వారా అందించడంలో జావిద్ హుస్సేన్ ఉపాధ్యాయుడుగా చేస్తున్న కృషికి పాఠశాల సిబ్బంది పలువురు అభినందించారు.

మట్టిలో మాణిక్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చి ఆమె ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసిన సవరాన్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు జావిద్ ను  పలువురు అభినందించారు.

ట్రిపుల్ ఐటీ ప్రవేశానికి సమయం ప్రకారం ఆదర్శంగా నిలిచిన ఉపాధ్యాయుడు

ఈ సందర్భంగా ఆయన తెలంగాణ రిపోర్టర్ తో మాట్లాడుతూ…

ఒక్కొక్క చినుకు కలిసి సముద్రం ఏర్పడుతుంది. అలాగే మనం చేసే చిన్న చిన్న ఆర్ధిక సహాయం పేద విద్యార్థినికి విద్యాభివృద్ధికి దోహదపడుతుందన్నారు.. ఆమె జీవితంలో స్థిరపడి మంచి ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నానంతే అని సంతోషముగా చెప్పుకొచ్చారు. …

తనకు సహకరించిన మిత్రులు, పూర్వ విద్యార్థులు, శ్రేయోభిలాషులు, పాఠశాల సిబ్బంది మరియు తన విన్నపాన్ని ఆలకించి వెంటనే స్పందించి అక్షయకు సహాయం అందించిన వారందరికి పేరు పేరునా కృతజ్ఞతలు కృతజ్ఞతలు తెలిపారు. 

కుమారి అక్షయ విద్యాభ్యాసం పూర్తయ్యేంత వరకు ఇంకా అవసరమైన సాయం కూడా బాధ్యతగా అందిస్తానన్నారు. ఆల్..ద..బెస్ట్ మాస్టారూ…జావిద్ హుస్సేన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights