సారంగాపూర్ మండల కేంద్రం బతుకమ్మ కుంట అటవీక్షేత్రంలోని అమృత్ సరోవర్ వద్ద యోగా దినోత్సవం

జగిత్యాల జిల్లా : సారంగాపూర్

వసుదైక కుటుంబం కోసం యోగ అనే ఇతి వృత్తంతో ఈ ఏడాది అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రపంచ ప్రజలు యావన్మంది ఆరోగ్యంగా, సుఖ సంతోషాలతో జీవనం సాగించాలన్నది ఈ ఏడాది యోగ దినోత్సవ ముఖ్యోద్దేశ్యం. 

యోగా సకారాత్మక శక్తిని తెస్తుంది. ప్రపంచం మొత్తాన్ని ఒకే పెద్ద కుటుంబంగా చూడటం, విశ్వసించటమే వసుదైక కుటుంబ భావన. ఈ విధంగా చూసినప్పుడు సంప్రదాయ భారత ఆచరణావిధానమైన యోగా “సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయ” (అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ రోగ రహితం గా ఉండాలి) అనే ప్రార్థన ఒక శక్తిమంతమైన చోదక శక్తిగా మారుస్తుంది.

ఈ నేపథ్యంలో… ప్రభుత్వ ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా లోని 56 అమృత్ సరోవర్ ల పేరిట చెరువులు కుంటల వద్ద యోగా దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు ఇందులో భాగంగా..సారంగాపూర్ మండల కేంద్రం బతుకమ్మ కుంట అటవీక్షేత్రంలో బుధవారం యోగా దినోత్సవం నిర్వహించారు. జిల్లా అటవీ శాఖాధికారి బి.వెంకటేశ్వర రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి కె.లక్ష్మినారాయణల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారితో పాటుగా, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, సారంగాపూర్ సర్పంచ్ గుర్రాల రాజేందర్ రెడ్డి, పాత్రికేయులు జైపాల్ రెడ్డి ,  కస్తూరిబాగాంధి బాలికల పాఠశాల విద్యార్థినులు, అధ్యాపకబృందం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…’వసుదైక కుటుంబం కోసం యోగా’ అనేది కేవలం ఒక రోజుకు పరిమితమయ్యే అంశం కాదనీ… ఎంతో ఆలోచించి, చర్చించి, ఎంతో ప్రభావశీలంగా ఉండేలా ప్రధాని నరేంద్ర మోడి ఆలోచించి రూపుదిద్దారనీ…యోగా ప్రతి ఒక్కరిలో ఒక మానసిక స్థైర్యంతో పాటు ఆరోగ్య పరిరక్షణ కు ఎంతో దోహదపడుతుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights