జగిత్యాల :

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వినియోగంపై అవగాహన కల్పించేందుకు ప్రదర్శన కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా తెలిపారు.

ప్రజలకు EVM లపై అవగాహన కల్పించేందుకు గురువారం రోజున సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ప్రారంభించినారు.

జిల్లాలోని IDOC, కోరుట్ల, మెట్ పల్లి ఆర్డీఓ కార్యాలయంలలో , ధర్మపురి AERO కార్యాలయంలో EVM ల ప్రదర్శన కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

క్షేత్ర స్థాయిలో ప్రజలకు విస్తృత అవగాహన కల్పించడానికి మూడు ప్రత్యేక వాహనాల ద్వారా EVM ల వినియోగంపై షెడ్యుల్ ప్రకారం అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి.ఎస్.లత, దివాకర, జిల్లా అధికారులు, కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights