మెగా లోక్ అదాలత్ సేవలను వినియోగించుకోవాలి
- గొడవలు వద్దు-రాజీలే ముద్దు : ఎస్.ఐ ఎల్లారెడ్డిపేట
- ఎల్లారెడ్డిపేట,సెప్టెంబర్ 23:
- నేటి నుండి 28వ తారీకు వరకు రాజీ పడదగిన కేసులో ఉన్నవారు రాజమార్గం ద్వారానే పరిష్కరించుకోవడమే మంచిదని, దీని ద్వారా సమయం వృధా కాదని కక్షలు,కారుణ్యాలు తగ్గుతాయని తద్వారా స్నేహభావం పెంపొందుతుందని ఎల్లారెడ్డిపేట ఎస్సై రమాకాంత్ తెలిపారు. మీ ఉచిత న్యాయ సేవ అధికార సంస్థ తేదీ 23-09-2024 నుండి 28-09-2024 వ తారీకు వరకు సిరిసిల్ల జిల్లా కోర్టులో మెగా లోక్ అదాలత్ ఉందని అన్నారు. ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మీపై కానీ, మీకు తెలిసిన వాళ్లపై గాని ఏమైనా కేసులు ఉంటే వాటిని పూర్తి పరిష్కారం (రాజీ) చేసుకుని కోర్టుకు హాజరైనట్లయితే ఆ కేసులను పూర్తిగా మూసి వేయడం జరుగుతుందని ఎస్సై తెలిపారు. గొడవ పడిన, ప్రమాదాలు జరిగిన, చీటింగ్ కు , వివాహ లకు సంబంధించిన, చిన్న చిన్న దొంగతనాలు, మరియు ఇతర రాజీ పడ దగ్గు కేసులు , ఈ మెగా లోక్ అదాలత్ లో కాంప్రమైజ్ చేసుకుని క్లోజ్ చేసుకునే అవకాశం ఉందని, కాబట్టి ఈ అవకాశాన్ని కేసు ఉన్నట్టు వంటి ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. దీన్ని కోసం ఫిర్యాదుదారుడు మరియు నేరస్తుడు (రాజీ పడినవారు) తమ యొక్క ఆధార్ కార్డు తీసుకుని సిరిసిల్ల కోర్టుకు రాగలరని తెలిపారు.పూర్తి సమాచారం కోసం :87126 56374, ఎస్సై ఎల్లారెడ్డిపేట,కోర్టు కానిస్టేబుల్ : 9052034397, శ్రీనివాస్ గౌడ్ 8712537735 పై నెంబర్లకు సంప్రదించగలరని ఎల్లారెడ్డిపేట ఎస్సై రమాకాంత్ తెలిపారు
Sircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee member of Indian Red Cross society.