సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్ విద్యార్థినిలకు.. బాలికల మరియు మహిళల రక్షణ చట్టాల గురించి, ఈవ్ టీజింగ్/ పోక్సో/ షీ టీమ్స్/ యాంటీ హ్యుమెన్ ట్రాఫికింగ్ లపై అవగాహన కల్పించిన పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత IPS.

-ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలి…

సైబర్ నేరాల పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలి, మీ చుట్టుపక్కల వారికి తెలియపరచాలి

-అపరిచిత వ్యక్తుల యొక్క ఫోన్ కాల్స్ మరియు మాటలు నమ్మవద్దు

సోషల్ మీడియాలో మంచిని స్వీకరించి …చెడును తుంచాలి

బాలికల మహిళల భద్రతకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం-మహిళల భద్రత మా బాధ్యత

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత IPS. మాట్లాడుతూ… బాధ్యతగా వ్యవహరించాలి… ప్రతి విషయంలో విజయం సాధిస్తారు. నర్సింగ్ కాలేజ్ చదువు పూర్తికాగానే మీకు ఉద్యోగాలు వస్తాయి మంచి భవిష్యత్తు ఉంటుంది. సోషల్ మీడియాలో గుర్తుతెలియని పరిచయాలు చేసుకోవద్దని నర్సింగ్ కాలేజ్ విద్యార్థినిలకు సూచించారు.

ఉద్యోగ సాధనలో స్కిల్స్ పెంచుకోవాలని సూచించారు. ఒకరికొక్కరు తోడుగా ఉండాలి,ఒకరి కష్టాలు ఒకరు పంచుకోవాలని. ఏదైనా విషయం ఉంటే పెద్దలకు స్నేహితులకు పోలీసులకు తెలియపరచాలి. మీ జీవితంలో ఏదైనా తప్పు జరిగితే వెంటనే పెద్దలకు మరియు బంధువులకుతెలపాలన్నారు

ప్రతి విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఏదైనా కష్టపడి సాధించాలి. మీరంతా అదృష్టవంతులు ఉద్యోగాలు వస్తాయి, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనోధైర్యాన్ని కోల్పోవద్దు…ఎంత పెద్ద సమస్య ఉన్నా ధైర్యంగా ఎదుర్కోవాలి. మొదటగా నీ రక్షణ నీ బాధ్యత అని ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. మహిళలు బాలికలు కష్టపడి చదివి ఎన్నో ఉన్నత స్థానాల్లో స్థిరపడుతున్నారని వారిని ఆదర్శంగాతీసుకోవాలన్నారు.

సమాజంలో మగవారితో పోటీపడి ఉద్యోగాలు సాధిస్తున్నారని తెలిపారు. చక్కగా చదువుకోవడం వలన భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుందని అన్నారు. పిల్లలను చదివించటానికి తల్లిదండ్రులు చేస్తున్న కష్టాన్ని మనసులో పెట్టుకొని చదువుపై శ్రద్ధ వహించాలని సూచించారు.

కష్టపడి చదవాల్సిన వయస్సులో చెడు అలవాట్లకు బానిసలు కావద్దని సూచించారు, కష్టపడి చదువుకుని ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు. ఎవరైనా ఎలాంటి వేధింపులకు గురైన వెంటనే షీటీమ్ పోలీసులకు సమాచారం అందించాలని సమాచారం అందించిన వాళ్ల పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు.

నర్సింగ్ కళాశాల విద్య చాలా ముఖ్యమైనదని ఎవరు కూడా మీ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోకుండా మంచిగా చదువుకోవాలని, ప్రతి ఒక్కరి రక్షణ గురించి షీటీమ్స్, భరోసా సెంటర్, పని చేయడం జరుగుతుందని, మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే డయల్ 100, షిటీమ్ వాట్సప్ నెంబర్ 8712667343 మహిళా పోలీస్ స్టేషన్ నెంబర్ 8712667435, ఫోన్ చేసి పోలీసుల సహాయం పొందవచ్చని సూచించారు.

ఈ కార్యక్రమంలో సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ లీల మేరీ, వైస్ ప్రిన్సిపల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కమలాదేవి, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ దుర్గ, మరియు షీటీమ్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights