కష్టజీవికి ఇరుపక్కల నిలిచిన కవి శ్రీశ్రీ

డల్లాస్: (USA):

కష్టజీవికి ఇరుపక్కల నిలబడి శ్రమైక జీవన సౌందర్యానికి సమానం లేదని చాటిన మహాకవి శ్రీశ్రీ అని మాడిశెట్టి గోపాల్ అన్నారు. డల్లాస్ లో ‘శ్రీ శ్రీ’ గారి 40వ వర్థంతి సందర్భంగా డాలసు సాహితీ మిత్రులు ఏర్పాటు చేసిన శ్రీ శ్రీ సంస్మరణ కార్యక్రమం లో ఆయన అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

మహాప్రస్థానంలోని ప్రతి కవిత యువతరాన్ని ఉత్తేజితులను చేసిందని సామాజిక చైతన్యానికి దోహదపడిందని ఆయన పేర్కొన్నారు. ఆయన రాసిన సినిమా పాటలు కూడా గొప్ప సందేశం తో కలకాలం నిలిచిపోయేలా ఉన్నాయన్నారు. కాదేది కవితకు అనర్హం అన్న మహాకవి శ్రీశ్రీ రచనలు భావితరాలకు కూడా స్పూర్తి నందిస్తాయని అభిప్రాయపడ్డారు.

ఈ ఆత్మీయ సమావేశానికి వారింట్లో ఏర్పాటు చేసి ఆతిథ్యం ఇచ్చిన జితేంద్ర స్వప్న ప్రియ దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి సమన్వయ కర్త గా ఇస్మాయిల్ వ్యవహరించగా, ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి, రమణ జువ్వాడి , దయాకర్, తదితరులు మాట్లాడి తమకు నచ్చిన శ్రీ శ్రీ కవితను వినిపించారు. ఇస్మాయిల్ వందన సమర్పణ చేశారు.

for news coverage

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights