జగిత్యాల :

వచ్చే ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వినియోగంపై ఓటర్లకు అవగాహన కార్యక్రమాలను జిల్లాలోని అన్ని నియోజక వర్గాలలో నిర్వహిస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా తెలిపారు.

ఓటింగ్ యంత్రాల ద్వారా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే విధానంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక వాహనాల ద్వారా విస్తృత ప్రచార కార్యక్రమాలను గురువారం రోజున సమీకృత కలెక్టరేట్ లో జెండా ఊపి కలెక్టర్, అదనపు కలెక్టర్ లు ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతీ ఒక్క ఓటరు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అవగాహన కల్పించడానికి ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు ప్రత్యేక వాహనాల ద్వారా జిల్లాలోని నియోజక వర్గాల పరిధిలోని ఓటర్లకు ప్రయోగాత్మకంగా అవగాహనకల్పించనున్నట్లు తెలిపారు.

అందులో భాగంగా ఎన్నికల షెడ్యుల్ వెలువడే వరకు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.ఎస్.లత, కలెక్టరేట్ పరిపాలన అధికారి నాగార్జున, DPRO ఎన్.భీమ్ కుమార్, అదనపు పి. డి. నరేష్,
కలెక్టరేట్ పర్యవేక్షకులు, ఎన్నికల విభాగం అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights