జగిత్యాల జిల్లా కేంద్రంలో SVEEP ఆధ్వర్యంలో మెప్మా సిబ్బందికి, మహిళలకు ఓటరు అవగాహన కార్యక్రమం-sveep జిల్లా నోడల్ అధికారి కె. లక్ష్మీనారాయణ

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు కీలకమైనదని అందుకే అర్హులైన వారందరు ఓటు హక్కును వినియోగించుకోవాలని జగిత్యాల జిల్లా స్వీప్ నోడల్ అధికారి కె.లక్ష్మినారాయణ అన్నారు.

జిల్లా SVEEP ఆధ్వర్యంలో మెప్మా సిబ్బందికి, మహిళలకు ఓటరు అవగాహన కార్యక్రమంను జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ యాస్మిన్ బాషా సూచనలతో జిల్లా నోడల్ అధికారి కె. లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మున్సిపల్ సమావేశ మందిరంలో కమిషనర్ అనిల్ కుమార్, పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ మెప్మా ఏఓ శ్రీనివాస్ గౌడ్ నిర్వహణలో చేపట్టారు.ఈ సందర్భంగా ఓటు హక్కు వినియోగం, సి-విజిల్ , ఓటర్ హెల్ప్ లైన్ ఆప్ ల డౌన్ లోడ్, 1950 తదితర అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు..

ఈ కార్యక్రమంలో జిల్లా SVEEP నోడల్ అధికారి లక్ష్మీనారాయణతో పాటుగా కమిషనర్ అనిల్ కుమార్, పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ మెప్మా ఏఓ శ్రీనివాస్ గౌడ్, స్వీప్ సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, మెప్మా ఆర్పీలు శ్రీమతి రజిత, సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు, పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights