జూన్ 22వరకు  పండుగ వాతావరణంలో వైభవోపేతంగా దశాబ్ది వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు -జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ బాషా

-దశాబ్ది ఉత్సవ వేడుకలకు అన్ని వర్గాలతో పాటు మీడియాకు ప్రత్యేక ఆహ్వానం : రాష్ట్ర దశాబ్ది వేడుకల నిర్వహణపై జిల్లా కలెక్టర్

జగిత్యాల :

ప్రభుత్వ ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లాలో  పండుగ వాతావరణంలో వైభవోపేతంగా రాష్ట్ర దశాబ్ది వేడుకలను నిర్వహించనున్నట్లు, ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ బాషా వెల్లడించారు.

సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లకు సంబంధించి జాతీయ పతాకావిష్కరణ తదితర అంశాలపై అదన కలెక్టర్లు బిఎస్ లత, మంద మకరంద తో కలిసి పరిశీలించారు.

జూన్ 2 నుంచి జూన్ 22 వరకు రాష్ట్ర దశాబ్ది వేడుకలలో జిల్లా ప్రగతి చాటే విధంగా ఘనంగా నిర్వహించడానికి జిల్లా అధికారయంత్రాంగం కృషి చేస్తుందన్నారు.ప్రధానంగా  3న రైతు దినోత్సవం, తర్వాత జూన్ 8న ఊరురా చెరువుల పండుగ నిర్వహణ పట్ల ప్రణాళికబద్దంగా రైతు సంక్షేమ పథకాలపై వివరిస్తూ, వారి గౌరవాన్ని చాటే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.

ఇంకా ఈ నెల 22 వరకు జరగనున్న దశాబ్ది ఉత్సవాల వేడుకలలో అన్ని వర్గాల ప్రజలతో పాటుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొనాలని…దశాబ్ది వేడుకలను మరింతగా ప్రజల్లోకి తీసుకు వెళ్లాలనీ…ఇందుకు ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నామని జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ బాషా అన్నారు.

3న రైతు దినోత్సవం నాడు జిల్లాలో ఉన్న రైతు వేదికలో వేడుకలు జరగాలని, ప్రతి గ్రామం నుంచి రైతులను డప్పులుతో ఘనంగా పండుగ వాతావరణంలో రైతు వేదికలకు తీసుకొని రావాలని, అక్కడ ప్రభుత్వం ప్రతి రైతుకు కల్పించిన సౌకర్యాలు, అందించిన సహాయంపై తెలియజేయాలని, భోజన ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. 

జూన్ 8న ఊరురా చెరువుల పండుగ సందర్భంగా గ్రామాల్లో ఉన్న పెద్ద చెరువు వద్ద బతుకమ్మ, బోనాలతో సాంస్కృతిక కార్యక్రమాలు, కట్ట మైసమ్మ పూజ,  భోజనాలు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

రైతు దినోత్సవం,ఊరురా చెరువుల పండుగ నిర్వహణకు జిల్లాలో అధికారులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసుకోవాలని, క్షేత్ర స్థాయిలో ప్రతి అంశాన్ని పర్యవేక్షిస్తూ.. ఎక్కడా ఎలాంటి పొరపాట్లు లేకుండా, విద్యుత్ రంగంలో గత పరిస్థితి, నేడు సాధించిన ప్రగతి తెలియజేస్తూ నాడు- నేడు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నామనీ, పోలీస్ ఆధ్వర్యంలో సురక్షా దివస్, తెలంగాణ రన్ నిర్వహించడానికి అవసరమైన చర్యలు చేపట్టడం జరిగిందని అన్నారు.

అలాగే  పారిశ్రామిక ప్రగతి, సాగునీటి రంగంలో సాధించిన విజయాలు ప్రజలకు తెలియజేసేలా తగు చర్యలు చేపట్టామని వివరించారు. 

జూన్ 9న సంక్షేమ సంబురాలు సందర్బంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో రెండవ విడత గొర్రెల పంపిణీ, అవకాశం ఉన్న చోట ఇంటి పట్టాల పంపిణీ, బీసి కులవృత్తుల ఆర్థిక సహాయం ప్రారంభించడం జరుగుతుందన్నారు. 

ప్రత్యేక రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన నూతన జిల్లాలు, మండలాలు, గ్రామాల వివరాలు తెలియజేస్తూ, మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలో సాధించిన ప్రగతి, క్రొత్త ఆసుపత్రుల ఏర్పాటు, అందిస్తున్న అదనపు సేవలను,

పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి సాధించిన విజయాలు ఘనంగా చాటేలా చర్యలు చేపడుతున్నామన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు గావిస్తున్నామని జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ బాషా ఈ సందర్భంగా వివరించారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights