నిరుపేద వైద్య వైద్యార్థినికి ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు చేయూత

ఎలిగేడు: 

మండలంలోని సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన కీర్తి రాజేశ్వరి-లక్ష్మయ్య దంపతుల మొదటి కూతురు కీర్తి శరణ్య ఇటీవల వెల్లడించిన నీట్ ఫలితాలలో రాష్ట్రస్థాయిలో 979 ర్యాంకు సాధించింది.ర్యాంకు సాధించి, మెడిసిన్ లో సీటు పొందినప్పటికీ… పేద కుటుంబం కావడంతో, మెడిసిన్ పూర్తి చేయడానికి దాతల చేయూత కోసం ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలో శాసన మండలి చీఫ్ విప్ తానిపర్తి భానుప్రసాదరావుకు ఈ విషయాన్ని స్థానిక బీఆర్ఎస్ నాయకులు వివరించారు.

ఈ మేరకు భానుప్రసాదరావు స్పందించి…శరణ్య వైద్య విద్యకు అయ్యే ఖర్చులను తానే భరిస్తానని చెప్పినట్లు స్థానిక బీఆర్ఎస్ నాయకులు మాజీ సర్పంచి తానిపర్తి సుధాకర్ రావు “తెలంగాణ రిపోర్టర్” కు తెలిపారు.. ఈ సందర్భంగా కీర్తి శరణ్యను సత్కరించారు.

ఈ సందర్భంగా సుధాకర్ రావు తమ పూర్వవిద్యార్థులతో కలిసి ఏర్పరచుకున్న ట్రస్టు ద్వారా ఆదివారం శరణ్య ఇంటికి వెళ్లి 25 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించి అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights