ఎయిరో స్పేస్ కు తెలంగాణ స్వర్గధామం

-ద్రిష్టి-10 స్టార్ లైనర్ యూఏవీ ఆవిష్కరణలో మంత్రి శ్రీధర్ బాబు

ఎయిరో స్పేస్ రంగానికి తెలంగాణ రాష్ట్రం స్వర్గధామమని, దేశంలోనే ఇక్కడ శక్తివంతమైన ఎయిరో స్పేస్ ఎకో సిస్టమ్ ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఎయిరో స్పేస్ ఉత్పత్తుల తయారీకి హైదరాబాద్ కేంద్రంగా మారిందన్నారు. భారతీయ నేవీ కోసం

అదానీ సంస్థ దేశీయంగా తయారు చేసిన ద్రిష్టి-10 స్టార్ లైనర్ అన్ మాన వరహిత ఏరియల్ వాహనం (యూఏవీ) ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం శంషాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ….

ఫ్రెండ్లీగా రాష్ట్ర పారిశ్రామిక విధానం ఉంటుందనీ…ఎయిరో స్పేస్, విమానయాన, అంతరిక్ష పరిశ్రమల రంగానికి తెలంగాణ ముఖ్యమైన కేంద్రమని తెలిపారు. ఎయిరో స్పేస్ తయారీ, సర్వీసింగ్, ఇంజనీరింగ్, శిక్షణ సంస్థలను నెలకొల్పడానికి రాష్ట్రంలో అనేక ఎయిరో స్పేస్, అనుబంధ పార్కులు ఉన్నాయన్నారు. రాష్ట్ర పారిశ్రామిక విధానం ఇండస్ట్రీ ఫ్రెండ్లీగా ఉందని పరిశ్రమవర్గాలు ప్రశంసించిన విషయాన్ని గుర్తు చేశారు.

ఎయిరో స్పేస్, అనుబంధ రంగాలకు సంబంధించి రాష్ట్రంలో వెయ్యికిపైగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయన్న మంత్రి.. ఇవి అంతర్జాతీయ ఎయిరో స్పేస్ సప్లై చైన్ లోకి వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరుచూ ఒరిజినల్ పరికరాల తయారీదారుల(ఓఈఎం)తో సప్లై చైన్ ఈవెంట్లను నిర్వహిస్తుందని వెల్లడించారు.

అంతర్జాతీయ ఓఈఎం లైన లాక్ హీడ్ మార్టిన్, బోయింగ్, జీఈ ఏవియేషన్, సాఫ్రాన్, రాఫేల్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్, ఎల్బిట్ సిస్టమ్స్ తదితర సంస్థల నుంచి రాష్ట్రం భారీ పెట్టుబడులను ఆకర్శించిందని వివరించారు. ఎయిరోస్పేస్ రంగానికి సంబంధించి కేంద్ర పౌర విమానయాన శాఖ నుంచి 2018, 2020, 2022 రాష్ట్ర అవార్డులను అందుకున్నదని, 2016-2020 మధ్యకాలంలో రాష్ట్రం నంబర్ వన్ ర్యాంకు సాధించిందని పేర్కొన్నారు. అదానీ సంస్థ హైదరాబాద్ లో 25 సరఫరాదారులతో సంబంధాలు సాగిస్తున్నదన్నారు.

ఆ సంస్థ డీఆర్డీఓకు ముఖ్యమైన భాగస్వామి అని శ్రీధర్ బాబు అన్నారు. మిసైల్స్ తయారీకి హైదరాబాద్ ఉత్పత్తి కేంద్రంగా మారిందని స్పష్టం చేశారు.

అదానీ సంస్థ హైదరాబాద్ నుంచి దాదాపు 20కి పైగా మానవరహిత ఏరియస్స్ సిస్టమ్స్ ను అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేసిందని పేర్కొ న్నారు. కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్, చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ హరికుమార్, భారతీయ ఆర్మీ ఎవియేషన్ డీజీ లెఫ్ట్ నెంట్ జనరల్ అజయ్ కుమార్ సూరి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights