జగిత్యాల :

నిరుపేద నిరుద్యోగ అభ్యర్థులకు స్పెక్ట్రం అకాడమీ వెలుగులు విరజిమ్ముతూ.. దిశా నిర్దేశం చూపాలని పలువురు వక్తలు తమ ఆకాంక్ష వ్యక్తం చేశారు.

జిల్లా కేంద్రంలోని స్పెక్ట్రం నవోదయ సైనిక్ అకాడమీ విద్యా సంస్థ మూడవ శాఖ ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం జరిగింది.

ఈ సందర్భంగా స్పెక్ట్రం సంస్థలో శిక్షణ పొందిన జగిత్యాలకు చెందిన పడాల రాజేష్ కుమార్ ఇటీవల సివిల్ ఎస్సై ఫలితాల్లో ఉత్తీర్ణత పొంది, ఎస్ఐ ఉద్యోగం సాధించిన సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా సంస్థ ఆవరణలో ఏర్పాటైన సమావేశంలో అకాడమీ నిర్వాహకులు నాగరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రముఖ గైనకాలజిస్ట్ జగిత్యాలకు చెందిన శ్రీమతి రామేశ్వరి సుధాకర్ రెడ్డి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ సభ్యులు, సీనియర్ జర్నలిస్ట్ సిరిసిల్ల శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్ కప్పల శ్రీకాంత్, జగిత్యాల బార్ సోసియేషన్ సభ్యులు మహేష్, సామాజిక సేవకురాలు శ్రీమతి బోనాల సునీత రావు, మరియు శ్రీవాణి కళాశాల ప్రిన్సిపల్ సిరిసిల్ల రాజేంద్ర శర్మ, ఐడిబిఐ బ్యాంక్ అధికారి శశిధర్ తో పాటు మహమ్మద్ బాబ్ జాన్, రాచర్ల రమేష్, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ స్పెక్ట్రమ్ అకాడమీ సంస్థ పేదల జీవితాల్లో వెలుగులు విరజిమ్మే సంస్థగా తమ ప్రయాణాన్ని కొనసాగించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.

చలిగల్ గ్రామానికి చెందిన నాగరాజు స్వయంగా తాను గతంలో కొద్ది మార్కులతో ఎస్సై ఉద్యోగం సాధించలేక పోయినప్పటికీ..నిరాశ చెందకుండా అదే కసితో మరో పదిమంది అభ్యర్థులను తయారు చేయాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన స్పెక్ట్రమ్ విద్యాసంస్థ క్రమంగా ఎదుగుతూ మంచి ఫలితాలు సాధించిందని, అందుకు నిదర్శనం ఇటీవల ఫలితాల్లో ఎస్సైగా ఉద్యోగం సాధించిన పడాల  రాజేష్ కుమార్ నిదర్శనం అన్నారు.

సమావేశం అనంతరం రాజేష్ కుమార్ తో పాటు స్పెక్ట్రం సంస్థలో మంచి ఫలితాలు సాధించి, సైనిక్ స్కూల్, నవోదయలో సీట్లు సాధించిన విద్యార్థులను సన్మానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights