తెలంగాణ రిపోర్టర్ కథనానికి విశేష స్పందన

-నిరుపేద వైద్య వైద్యార్థినికి అవసరమైన సాయం అందిస్తాం : పలువురు ఎన్ ఆర్ఐ లు

కరీంనగర్:(జగిత్యాల):

నిరుపేద వైద్య వైద్యార్థిని కీర్తి శరణ్య మెడిసిన్ లో 979 ర్యాంకు సాధించి సీటు పొందినా కూడా, ఆర్థిక స్తోమత లేక కొట్టు మిట్టాడుతున్న పరిస్థితులలో… మెడిసిన్ విద్యార్థిని కథనాన్ని తెలంగాణ రిపోర్టర్ అందించిన సంగతి తెల్సిందే.

ఈ వాస్తవ కథనానికి దేశ విదేశాలనుంచి అపూర్వ స్పందన లభిస్తుంది…

ఈ కథనాన్ని చూసిన ప్రియ మిల్క్ ఎం.డి.బొంత దామోదర్ రావు, డైరెక్టర్ నామ రాంమోహన్ రావు స్పందించారు.నిరుపేద వైద్య వైద్యార్థిని మెడిసిన్ పూర్తయ్యేంతవరకు తమదే బాధ్యత అని “తెలంగాణ రిపోర్టర్” సిఈఓ సిరిసిల్ల శ్రీనివాస్ కు వెల్లడించడంతో పాటుగా స్వయంగా గ్రామానికి వెళ్లి శరణ్యను, ఆమె తల్లితండ్రులను కలిసి ప్రకటించారు.

దీంతో..తెలంగాణ రిపోర్టర్” సిఈఓ సిరిసిల్ల శ్రీనివాస్ అందించిన వాస్తవ కథనానికి అపూర్వ స్పందన లభిస్తుంది. దేశ విదేశాలనుంచి సైతం…శరణ్యకు సాయం చేస్తామని ముందుకొస్తున్నారు. 

In this order, many NRIs living in America who are UOFONE former students of Tatipally Residential Jr. College, who have seen this article, are responding.

తెలంగాణ రిపోర్టర్” సిఈఓ సిరిసిల్ల శ్రీనివాస్ సమాజం ముందుంచిన కథనానికి ..  కరీంనగర్ కు చెందిన శ్రీమతి అనిత స్పందించి, శరణ్యను ప్రోత్సహించడానికిగాను నేరుగా శరణ్యతో అమెరికా నుంచి మాట్లాడి, వెంటనే  రు.10 వేల ఆర్థికసాయంను డిజిటల్ పేమెంట్ ద్వారా పంపించారు. 

అలాగే, మరో పూర్వ విద్యార్థి శ్రీధర్ సైతం స్పందించారు.. చిన్ననాటినుండి చదువు కోసం ఆర్థిక ఇబ్బందులతో తాను పడ్డ కష్టం మరెవ్వరూ పడకూడదన్న ధ్యేయంగా అమెరికా లోని తన మిత్రబృందం ఒక ట్రస్టు ఏర్పాటు చేసుకున్నారు. ఈ ట్రస్టు ద్వారా ఎంతో మంది పేదలకు వారి వారి విద్యకోసం సాయమందిస్తున్నారు.

ఈ ధ్యేయంగా ఒక భారతీయ పౌరుడిగా తనవంతు బాధ్యతను విస్మరించకుడా వ్యవహరిస్తున్న శ్రీధర్ కూడా తెలంగాణ రిపోర్టర్ కథనానికి స్పందించి…ఇందుకు సహకరించిన ప్రధానోపాధ్యాయుడు తిరుమల్ కు ఆయనకు చేదోడువాదోడుగా పనిచేస్తున్న జావిద్ హుస్సేన్ అనే ఉపాధ్యాయుడికి అమెరికా నుంచి ఫోన్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తూ…తెలంగాణ రిపోర్టర్” సిఈఓ సిరిసిల్ల శ్రీనివాస్ కు అభినందనలు చెప్పారు.

అలాగే, కీర్తి శరణ్యతోనూ మాట్లాడి, మెడిసిన్ పూర్తయ్యేంతవరకు ఏ సాయమైనా అందిస్తాననీ…ఏ అవసరమున్నా ఫోన్ చేయాలని శరణ్యకు అండగా ఉండి, ఆయనకూడా తనవంతు సాయం అందించడానికి తోడుంటారన్న భరోసా కల్పించారు.

మొత్తానికి కీర్తి శరణ్య కథనానికి స్పందిస్తున్న ప్రతిఒక్కరికీ ఈ సందర్భంగా తెలంగాణ రిపోర్టర్” సిఈఓ సిరిసిల్ల శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights