జగిత్యాల:

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా రక్తదాన శిబిరం:జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో ఫ్లాగ్ డే సందర్భంగా శుక్రవారం స్థానిక విరూపాక్షి ఫంక్షన్ హాల్ లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి వారి సహకారంతో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు.మెగా రక్తదాన శిబిరానికి ముఖ్య అతిధిగా జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ గారు హాజరై పోలీస్ అధికారులు, రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులను స్మరిస్తూ మౌనం పాటించడం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ…. విధి నిర్వహణలో కర్తవ్యమే లక్ష్యంగా ప్రాణత్యాగం చేసి అమరులైన పోలీసులను ఈ సమాజం ఎప్పటికీ మరువదని, వారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రజల ధన, మాన, ప్రాణాలను కాపాడుతూ సంఘవిద్రోహ శక్తుల చేతుల్లో బలైన అమరులైన పోలీసు వీరులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరానికి ప్రతి ఒక్కరు రక్తదానం చేసే విధంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో డిఎస్పీ లు, సీఐ లు ,ఎస్ఐలు , సిబ్బంది వారి వారి పోలీస్ స్టేషన్ల పరిధిలో అవగాహన కల్పించి ప్రతి ఒక్కరు రక్తదానం చేసే విధంగా అవగాహన కల్పించడం జరిగిందని వివరించారు. జగిత్యాల ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తో పాటుగా కరీంనగర్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ సిబ్బంది మరియు స్థానిక బ్లడ్ బ్యాంక్ వైద్యులు, సిబ్బంది సహకారం పట్ల జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ కృతజ్ఞతలు తెలిపారు.

రెగ్యులర్ పోలీసింగ్ తో పాటు ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఆదుకునేందుకు, ఎంతోమంది వ్యాధిగ్రస్తులకు రక్తం చాలా అవసరం వారికి సహాయం కోసం అమరవిరుల స్మరకర్ధం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో సుమారు 300 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది, BSF సిబ్బంది, జిల్లాలోని యువకులు, పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా పట్టణ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న 60 సంవత్సరాల ASI చంద్రశేఖర్ రక్తదానం చేసినందుకు మరి అదేవిధంగా 68 మార్లు రక్తదానం చేసిన కనపర్తి రవి, 48 మార్లు రక్తదానం చేసిన సాయి కుమార్ ను జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ అభినందించి సన్మానించారు.

ఈ కార్యక్రమాలలో అడిషనల్ ఎస్పీ లు ప్రభాకర రావు, భీం రావ్, డిఎస్పీలు రవీంద్ర కుమార్, వెంకటస్వామి, ఇన్స్పెక్టర్లు నటేశ్,కోటేశ్వర్ ,రమణమూర్తి , ఆరిఫ్ అలీ ఖాన్ , ఆర్.ఐ లు వేణు ,రామకృష్ణ ,జనిమియా మరియు ఎస్.ఐ లు, జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సెక్రటరీ మంచాల కృష్ణ, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, కొమురవెల్లి వేణుగోపాల్ , కరీంనగర్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కేశవరెడ్డి, పోలీస్, BSF సిబ్బంది, యువకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights