రాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డిపేట: (sampath p)

లడ్డు వేలం పాటలో 6 వేలకు దక్కించుకున్న భక్తుడు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామంలో గల శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం దత్తత శివాలయంలో శనివారం ఉదయం పూర్ణాహుతితో బ్రహ్మోత్సవాలు ముగిశాయి.

శుక్రవారం అర్ధరాత్రి కళ్యాణం అనంతరం కళ్యాణం లడ్డును వేలంపాట వేయగా 6 వేల రూపాయలకు ఎలవేని లింగం దక్కించుకున్నారు. అలాగే భక్తులకు నిమ్మ బుచ్చిరెడ్డి, మోతే లక్ష్మారెడ్డి పండ్లు, సిరా ప్రసాదాలను వితరణ చేశారు.

అర్చకులు వేణుగోపాల చారి లింగోద్భవ కార్యక్రమాన్ని భక్తులతో అభిషేకాలు చేయించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు నిమ్మ లక్ష్మి, దొమ్మాటి నర్సయ్య, మాజీ ఉపసర్పంచ్ మహేందర్, ఎంపీటీసీ అపేరా సుల్తానా, ఆలయ కమిటీ చైర్మన్ సూర నర్సయ్య, నిమ్మ సుధాకర్ రెడ్డి బొమ్మెడి భాస్కర్ భక్తులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights