ప్రజాపాలన దరఖాస్తు ఫారాలను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుంది- స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి.ఎస్.దివాకర

-రేషన్ కార్డ్ కోసం తెల్ల కాగితం పై దరఖాస్తు రాసివ్వాలి

జగిత్యాల 

ఆరు గ్యారంటీల పథకాలకు అర్హులైన లబ్ధిదారులు ప్రజా పాలన కార్యక్రమాలలో దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన ఫారాలను ఉచితంగా ప్రభుత్వం అందజేస్తుందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి.ఎస్.దివాకర ఒక ప్రకటనలో తెలిపారు.

స్థానిక గ్రామ పంచాయతీ, మునిసిపల్, మండల అభివృద్ధి అధికారి, తహశీల్దార్ కార్యాలయాల్లో ఉచితంగా పొందవచ్చని ఆయన వెల్లడించారు.

రేషన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే వారు…..

అలాగే,  రేషన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే వారు ప్రజా పాలన దరఖాస్తులు స్వీకరించే కేంద్రాలవద్ద తెల్ల కాగితం పై దరఖాస్తు రాసి ప్రత్యేక కౌంటర్ లో అందజేయాలని లేదా మీ- సేవా కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవచ్చని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి.ఎస్.దివాకర తన ప్రకటనలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights