ఎన్నికలను సమర్దవంతంగా పారదర్శకంగా నిర్వహించడానికి పౌరులందరి భాగస్వామ్యం ఎంతో అవసరం: జిల్లా ఎన్నికల అధికారిణి షేక్ యాస్మిన్ బాషా

తెలంగాణా శాసనసభ ఎన్నికలను సమర్దవంతముగా, పారదర్శకముగా నిర్వహించడానికి పౌరులందరి భాగస్వామ్యం ఎంతో అవసరమని జిల్లా ఎన్నికల అధికారిణి, జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ ఎన్నికలను పారదర్శకముగా నిర్వహించడానికి జిల్లాలోని ప్రతి ఒక్కరూ కలసి కట్టుగా కృషి చేయాలని కోరారు. ఏదైనా ప్రాంతములో ఓటర్లను మభ్యపెట్టడానికి డబ్బు, మద్యం మరియు ఇతర వస్తువులు నిల్వయుంచినట్లు తెలిసినట్లయితే… బాధ్యత గల పౌరులుగా ఆ సమాచారాన్ని జిల్లా యంత్రాంగంనకు తెలియపరచాలని కోరారు..

ఈ సమాచారం తెలియపరచిన వారి ఫోన్ నెంబరు మరియు వారి వివరములు గోప్యముగా ఉంచబడుతుందని పేర్కొన్నారు.అంతేగాకుండా తగిన పారితోషకము అందించబడుతుందని ప్రకటించారు.

అలాగే పౌరులు జిల్లా IT శాఖ అధికారి ఫోన్ నెంబరు (8985970941) కు గానీ, cVIGIL ఆప్ ద్వారా గానీ, జిల్లా కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ ఫోన్ నెంబరు 18004257620 కు లేదా 1950 టోల్ ఫ్రీ నెంబరుకు డయల్ చేసి, సమాచారము అందించగలరని జిల్లా ఎన్నికల అధికారిణి, జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ బాషా తన ప్రకటనలో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights