న్యూఢిల్లీ:

కొత్త పార్లమెంటులో ఆరు ద్వారాలకు సంబంధించి ఆసక్తికర విషయం…ఆరు దర్వాజాలకు పౌరాణిక నేపథ్యం ఉన్న ప్రాణుల పేర్లు పెట్టారు. ఈ గుమ్మాలకు వాటిని కాపలాగా ఉంచిన వైనం..

అందుకురూపొందించిన శిల్పాల్ని చూసినంతనే ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ ద్వారాలకు పెట్టిన పేర్లు కూడా ఘనచరిత్రను ప్రతిబింబించేలా ఉన్నాయని చెప్పాలి.

కొత్త పార్లమెంటు భవనంలో మొత్తం ఆరు ద్వారాలు ఉన్నాయి. వీటికి పెట్టిన పేర్లు చూస్తే..

  1. గజ ద్వారం
  2. అశ్వ ద్వారం
  3. గరుడ ద్వారం
  4. మకర ద్వారం
  5. శార్దూల ద్వారం
  6. హంస ద్వారం

‘గజ ద్వారం’ ప్రత్యేకత ఏమంటే.. పార్లమెంటు కొత్త భవనం ఉత్తరం వైపు ఉన్న ఈ ద్వారానికి బుద్ధి.. సంపద.. జ్ఞాపకశక్తి.. జ్ఞానానికి ప్రతీకగా చెప్పే గజరాజు పేరును దీనికి పెట్టారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తరం బుధగ్రహంతో సంబంధం ఉందని.. ఇది తెలివికి మూలమని విశ్వసిస్తారు.

రెండో ద్వారం పేరు అశ్వ ద్వారం. గుర్రం పేరు మీద ఈ గుమ్మానికి పేరుపెట్టటమే కాదు.. దీనికి కాపలాగా అందమైన గుర్రం బొమ్మల్ని చెక్కారు. శక్తికి.. బలానికి.. ధైర్యానికి నెలవుగా గుర్రాన్ని చెబుతారు. పాలనలో కావాల్సిన లక్షణాల్ని ఈ ద్వారం గుర్తు చేస్తుందని చెబుతున్నారు.

మూడో ద్వారం పేరు గరుడ ద్వారం. శ్రీమహా విష్ణువు వాహనమైన గరుడ వాహనం పక్షులకు రాజుగా చెబుతారు. శక్తికి.. ధర్మానికి చిహ్నంగా గరుడను చెబుతారు. అనేక దేశాల చిహ్నాలపై గరుడ బొమ్మ ఉండటం తెలిసిందే. తూర్పు ద్వారంగా ఉండే గరుడ ద్వారాన్ని ఏర్పాటు చేశారు.

మొసలిని మకరంగా పిలవటం తెలిసిందే. మకరం వివిధ జీవుల కలయికగా పేర్కొంటారు. మన దేశంలోని భిన్నత్వంలో ఏకత్వం అన్న మాటకు నిదర్శనంగా దీన్ని ఏర్పాటు చేశారు. పాత పార్లమెంట్ భవనం ప్రవేశ ద్వారం వైపు మకర ద్వారాన్ని ఏర్పాటు చేశారు.

ఐదో ద్వారం శార్దూలం పేరుతో ఏర్పాటు చేవారు. దేశ ప్రజల శక్తిని సూచించేలా దీన్ని ఏర్పాటు చేశారు.

ఆరో ద్వారానికి హంస ద్వారమన్న పేరును పెట్టారు. హంస మోక్షానికి నెలవుగా చెబుతారు. జనన.. మరణ చక్రం నుంచి ఆత్మ విముక్తిని సూచన చేసే హంసను ఆరో ద్వారంగా ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights