జగిత్యాల 

ప్రతీ విద్యార్థి తన లక్ష్యాన్ని అధిగమించాలంటే ఫ్యాషన్ తో కాకుండా ఒక ధృడ సంకల్పంతో ప్యాసన్ చదవుకోవాలని ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అన్నారు.

అల్ఫోర్స్ జూనియర్ కళాశాల వ్యవస్తాపకుడు నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని డిఎల్ గార్డెన్స్ లో నిర్వహించిన ఫ్రెషర్స్ డే కార్యక్రమానికి  ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డా.సంజయ్ కుమార్ తో పాటుగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఇంటర్మీడియట్ లో విద్యార్థి ఎలాంటి గందరగోళంకు గురికాకుండా ఒక నిర్ధిష్టమైన విధానంతో ముందుకు సాగాలన్నారు. ఏ లక్ష్యం చేరుకోవాలన్నా క్రమశిక్షణ తో కూడిన విద్యయే ప్రధానమన్నారు. ఉన్నత వ్యక్తులుగా ఎదగడానికి వచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఆల్ఫోర్స్ విద్యాసంస్థల ఛైర్మెన్ నరేందర్ రెడ్డి, నాయకులు దావా సురేష్, సిహెచ్. సుధాకర్, కరస్పాండెంట్ చంద్ర శేకర్ రెడ్డి, ప్రిన్సిపల్ రజినీ, వైస్ ప్రిన్సిపాల్ ముజీబ్ , ఉజ్వల్, ఉపాద్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights