హైదరాబాద్ :

రాత్రి పాతబస్తీలో ప్రత్యక్షమైన మంత్రి కేటీఆర్‌

ఎలాంటి ప్రోటోకాల్‌ లేకుండానే వెళ్లిన కేటీఆర్‌

సాధారణ కస్టమర్‌లా ఓ హోటల్‌కు వెళ్లిన మంత్రి

బిర్యానీతో పాటు పలు రకాల వంటకాలు ఆస్వాదించిన కేటీఆర్‌

కేటీఆర్‌ రావడంతో సెల్ఫీల కోసం ఎగబడ్డ జనం

హోటల్‌లో పలువురు కస్టమర్లను పలకరించిన మంత్రి

పాతబస్తీ మదీనా చౌరస్తా దగ్గర ఓ రెస్టారెంట్‌లో మంత్రి కేటీఆర్‌ కనిపించడంతో.. అక్కడకు వచ్చినవారంతా ఒక్కసారిగా షాకయ్యారు. ఎలాంటి హడావుడి లేకుండానే.. వితౌట్‌ ప్రోటోకాల్‌ ఆయన రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడకు వెళ్లేంత వరకు ఆయనను పెద్దగా ఎవరూ గుర్తుపట్టలేదు.. కాని ఆర్డర్‌ ఇచ్చే సమయంలో మంత్రిని చూసిన అక్కడివారు ఆశ్చర్యపోయారు.

కేటీఆర్‌ వస్తున్నారంటూ కాన్వాయ్‌తోపాటు.. పోలీసుల హడావుడి ఉంటుంది కాని.. ఇలా సాధారణ పౌరుడిలా వచ్చి బిర్యానీ ఆర్డర్‌ ఇవ్వడం చూసి షాక్‌ అయ్యారు.

ఆయన బిర్యానీతోపాటు.. పలురకాల దేశవిదేశీ వంటకాల రుచిచూశారు. మంత్రి వచ్చారని తెలుసుకుని ఆయనకు స్పెషల్‌ డిషెస్‌ను వడ్డించారు రెస్టారెంట్‌ యాజమాన్యం. ఆయన ఇటు డిన్నర్‌ చేస్తూనే.. అక్కడకు వచ్చిన వారిని పలకరించారు. మంచిచెడులు అడిగి తెలుసుకున్నారు. అటు హోటల్‌కు పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. మంత్రితో సెల్ఫీలకోసం ఎగబడ్డారు జనం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights