మున్సిపల్ కమిషనర్ రేసులో జక్కా శ్రీనివాస్ 

కరీంనగర్ : (M.Kanakaiah):

గత 15 సంవత్సరాలకు పైగా పంచాయతీరాజ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న జక్కుల శ్రీనివాస్ ప్రస్తుతం జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పడ్కల్ లో మండల పంచాయతీ అధికారిగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి సంజీవరావు పర్యవేక్షణలో జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దివాకర ఆదేశాలతో…బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తున్నారు.

పంచాయతీరాజ్ శాఖలో విధులు నిర్వహిస్తూ, అందరి మన్ననలు పొందుతూ ఒక మంచి అధికారిగా పేరు తెచ్చుకుంటూ…ప్రస్తుతం ప్రమోషన్ దిశలో ఉన్నారు.

ఈ నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ గా ప్రమోషన్ పొందే అవకాశం జక్కుల శ్రీనివాస్ కు కలగనుందని ఆయన తోటి ఉద్యోగులు అంటున్నారు.

ఇందుకు సంబంధించి ప్రభుత్వం వద్ద ఫైల్ ఉన్నట్లు తెలుస్తోంది. జక్కుల శ్రీనివాస్ గ్రామీణ ప్రాంత వ్యవస్థలో మంచి అనుభవం ఉండి గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, మౌలిక వసతుల కల్పన, ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉంటూ, 2021-22 స్వఛ్చ సర్వేక్షణ్ గ్రామీణ్ అవార్డుల్లో పడ్కల్ గ్రామపంచాయతీకి అవార్డు కూడా సాధించడంలో అందరి సమన్వయంతో కృషి చేసి, మంచి అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

ఈ సందర్భంలో ఆయన పట్టణ ప్రాంతంలో మున్సిపల్ కమిషనర్ గా ప్రమోషన్ పై చేరుకుంటే మరింతగా రాణించవచ్చని ఆయన తోటి ఉద్యోగులు ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నారు… ఆల్ ది బెస్ట్ శ్రీనివాస్ !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights