జగిత్యాల జిల్లా

ధర్మపురి పట్టణంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో వృద్ధులకు, దివ్యాంగులకు మరియు ట్రాన్స్ జెండర్ లకు ఉచిత వైద్య పరీక్షల శిబిరం…..

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో వృద్ధులకు, దివ్యాంగులకు జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో ఉచిత వైద్య పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళా, శిశు, వయోవృద్ధులు, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరయ్యారు. వైద్య పరీక్షలు చేస్తున్న తీరును మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి చేతుల మీదుగా వృద్దులకు మందులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్తంగా మొబైల్ వాహనం ద్వారా దివ్యాంగులకు, వృద్ధులకు, ట్రాన్స్ జెండర్లకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఇవ్వడం జరుగుతుందని మంత్రి తెలిపారు.

మారుమూల ప్రాంతంలోని వయోవృద్ధులకు వైద్య పరీక్షలు అందించడం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు. ప్రతిరోజు వివిధ గ్రామాలలో మొబైల్ వాహనం తిరుగుతూ పరీక్షలు నిర్వహించి మందులు ఇస్తుందని చెప్పారు. అందరూ ఈ అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దూర ప్రాంతాలకు వెళ్లి పరీక్షలు చేయించుకోలేని వారికి ఇది మంచి అవకాశం అని మంత్రి చెప్పారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి డా.భోనగిరి నరేష్, రెడ్ క్రాస్ సొసైటీ కార్యదర్శి మంచాల కృష్ణ, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కార్యవర్గ సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, ధర్మపురి మున్సిపల్ చైర్మన్ సంగి సత్తెమ్మ, డీ.సీ.ఎం.ఎస్ చైర్మన్ ఎలా శ్రీకాంత్ రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు ఎంఎంయు వైద్య సిబ్బంది డా.కృష్ణతేజ, ఎస్. వేణుగోపాల్, కుమారి విరాజిత పాల్గొన్నారు.

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిచిన వైద్య శిబిరానికి సహకరించిన సంక్షేమశాఖ అధికారి డా.నరేష్ తో పాటుగా అంగన్ వాడీ, ఆశా, మెప్మా మహిళలు అందించిన సహకారానికి జిల్లా శాఖ పక్షాన రెడ్ క్రాస్ కమిటీ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights