అశ్విని హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

రాజన్న సిరిసిల్ల జిల్లా: (sampath p)

ఎల్లారెడ్డిపేట మండలం భాకూరు పల్లె తండా గ్రామ పంచాయతీ లో ఎల్లారెడ్డిపేట అశ్విని హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి అభినవ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని శుక్రవారం రోజున ప్రారంభించారు.

ఈ వైద్య శిబిరంలో రోగులకు ఉచితంగా రక్త పరీక్షలు చేసి అవసరమున్నవారికి ఉచితంగానే మందులు అందజేశారు,
అలాగే కంటి సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమున్న వారికి కూడా కంటి అద్దాలు ఉచితంగానే అందజేశామన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అజ్మీరా మంజుల రాజు నాయక్ , ఉపసర్పంచ్ యశ్వంత్, గ్రామస్తులు తిరుపతి , రాజు , గేనవ్వ, శీలవ్వ హాస్పిటల్ వైద్య సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights