ప్రభుత్వాలు మారినా ప్రజల సంక్షేమ పథకాలు యథాతథం-బీజేపీ కామారెడ్డి అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి
దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామంలో కామారెడ్డి అసెంబ్లీ అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా వెంకట రమణారెడ్డి తన ప్రచారంలో మాట్లాడుతూ… ప్రభుత్వాలు మారినా ప్రజలకు అందే సంక్షేమ పథకాలు అలాగే కొనసాగుతాయనీ, రమణ రెడ్డి గెలిస్తే కామారెడ్డి లో పింఛన్లు బంద్ చేస్తారు అని అధికార పార్టీ నాయకులు బెదిరిస్తున్నారని ఆరోపించారు.
కానీ అధికార పార్టీ నాయకుల మాటలు ప్రజలు నమ్మరాదని అన్నారు. బీజేపీ గెలిస్తే అర్హులైనవారికి ప్రతీ సంక్షేమ పథకం అందేలా చూసే బాధ్యత తనదే అని అన్నారు. ఉచిత విద్య, వైద్యం భాధ్యత తనదని భరోసా ఇచ్చారు.
Sircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee member of Indian Red Cross society.