నియోజకవర్గంలోని పలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సాధారణ పరిశీలకులు :ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ నరసింహమూర్తి

జగిత్యాల 

జగిత్యాల శాసన సభ నియోజక వర్గంలోని పలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సాధారణ పరిశీలకులు పరిశీలించారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, రెవెన్యూ డివిజన్ అధికారి నరసింహమూర్తి తెలిపారు. 

ఆదివారం జగిత్యాల, ధర్మపురి నియోజక వర్గ సాధారణ పరిశీలకులు హెచ్. బసవ రాజేంద్ర జగిత్యాల నియోజక వర్గంలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారని తెలిపారు.

నియోజకవర్గంలో 54 సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయని  తెలిపారు. జగిత్యాల పట్టణంలోని పలు సమస్యాత్మక కేంద్రాలను సాధారణ పరిశీలకులు పరిశీలించారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో సహాయ రిటర్నింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights