ఓట్ల లెక్కింపు కేంద్రం, స్ట్రాంగ్‌ రూంల పరిశీలించిన ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ జగదీష్ సొన్ కర్ (Dr.Jagdish sonkar), వ్యయ పరిశీలకులు జి. మణిగండసామి

సిరిసిల్ల 20, నవంబర్ 2023

శాసనసభ ఎన్నికల సందర్భంగా సోమవారం
తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రం, స్ట్రాంగ్‌ రూములను ఎన్నికల సాధారణ పరిశీలకులుగా డాక్టర్ జగదీష్ సొన్ కర్ (Dr.Jagdish sonkar), వ్యయ పరిశీలకులు జి. మణిగండసామి, రిటర్నింగ్ అధికారులు ఆనంద్ కుమార్, మధు సూదన్, DSP ఉదయ్ రెడ్డి ల తో కలిసి పరిశీలించారు.

డిసెంబర్‌ 3న నిర్వహించే ఓట్ల లెక్కింపు సందర్భంగా, సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్‌ కేంద్రాలలో చేపట్టిన పనుల వివరాలను సాధారణ ఎన్నికల పరిశీలకులకు రిటర్నింగ్ అధికారులు వివరించారు.
లే అవుట్ మ్యాప్ ను పరిశీలించారు.
కౌంటింగ్‌ కేంద్రాల వద్ద చేపడుతున్నపనులు,వసతులు,సదుపాయాలను పరిశీలించిన పిదప పరిశీలకులు సంతృప్తి వ్యక్తపరిచారు.
ఎన్నికల సంఘం నిబంధన మేరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు.
పటిష్ట భద్రత చర్యలు చేపట్టాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights